తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.స్కిట్ లలో తన వరస పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నాడు హైపర్ ఆది.
ఇకపోతే ప్రస్తుతం బుల్లితెరపై తిరుగులేని కమెడియన్‌గా వెలుగొందుతున్న వారిలో హైపర్ ఆది కూడా ఒకరు.జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న హైపర్ ఆది సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.
ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో హీరో ఫ్రెండ్ పాత్రలు కూడా చేసిన విషయం తేలిసిందే.
అయితే ప్రస్తుతం బుల్లితెరపై ఉన్న కమెడియన్ ను లో ఒకరిగా గుర్తింపు సంపాదించుకున్నాడు అంటే అందుకు గల కారణం జబర్దస్త్ షో అని చెప్పవచ్చు.
అలాంటిది తన బిజీ షెడ్యూల్ కారణంగా జబర్దస్త్ షోకు గ్యాప్ తీసుకుంటున్నాడు.కానీ జబర్దస్త్ తర్వాత చేస్తున్న ఢీ షోని చేస్తూ కంటిన్యూ అవుతున్నాడు హైపర్ ఆది.ఇదిలా ఉంటే తాజాగా ఢీ షోకీ హీరో అడివి శేష్, అలాగే సయీ మంజ్రేకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ క్రమంలోనే హైపర్ ఆది మాట్లాడుతూ.
నాకు ప్రియా నోట్లో నుంచి ఓకే పండగో ఎంజాయో అని మాట వినాలని ఉంది అనడంతో ప్రియమని ఆ డైలాగ్ ని తనతోపాటు జానీ మాస్టర్,నందిత కూడా చెప్పిస్తుంది.ఆ తర్వాత సయీ మంజ్రేకర్‌ను చెప్పమని కొంచం రొమాంటిక్ గా అడగగా అప్పుడు అడివి శేష్ అలా శృంగారం లేకుండా ఒకసారి అను అని అనడంతో అప్పుడు హైపర్ ఆది నార్మల్ గా ట్రై చేసినప్పటికీ అలాగే రావడంతో నార్మల్ గా అనలేవా అంటూ అడవి శేష్ హైపర్ ఆది అంటూ పరువు తీసేశాడు.
ఆ తర్వాత హైపర్ ఆది, కంటెస్టెంట్ తేజస్విని తో కలసి స్కిట్ చేయగా అందులో భాగంగానే కుర్చీలో కూర్చున్న హైపర్ ఆది తప్పుగా సమాధానాలు చెప్పడంతో కరెంట్ షాక్ ఇస్తారు.