ముఖం ఎంత తెల్లగా ఉన్నా మొటిమలు, ముదురు రంగు మచ్చలు ఉంటే కాంతిహీనంగానే కనిపిస్తుంది.అందుకే చర్మంపై మొటిమలున్నా, మచ్చలున్నా తెగ హైరానా పడిపోతుంటారు.
ఈ క్రమంలోనే వాటిని తగ్గించుకోవడం కోసం మార్కెట్‌లో లభ్యమయ్యే ఖరీదైన క్రీమ్స్, సీరమ్స్, మాయిశ్చరైజర్స్ కొనుగోలు చేసి వాడుతుంటారు.తరచూ ఫేస్ ప్యాకులు, మాస్క్‌లు వేసుకుంటారు.
అయినా తగ్గకుంటే ట్రీట్‌మెంట్స్ సైతం చేయించుకుంటారు.కానీ, అంత వరకు వెళ్లాల్సిన పని లేదు.
ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ ఎఫెక్టివ్ రెమెడీని ట్రై చేస్తే మొటిమలు, మచ్చలు తొలగిపోవడంతో పాటు చర్మ కాంతి కూడా రెట్టింపు అవుతుంది.మరి లేటెందుకు ఆ రెమెడీ ఏంటో.
దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.చూసేద్దాం పదండీ.
ముందుగా ఎండిన చామంతి పూలను సేకరించి పెట్టుకోవాలి.రెమెడీ కోసం స్టవ్ ఆన్ చేసిన ఒక గిన్నె పెట్టి.
అందులో గ్లాస్ వాటర్ మరియు గుప్పెడు ఎండిన చామంతి పూలు వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.
బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సాయంతో వాటర్ ను సపరేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత మరో బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, వన్ టేబుల్ స్పూన్ గోధుమ పండి, చిటికెడు పసుపు, వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, రెండు చుక్కలు విటమిన్ ఇ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి.

చివరిగా ఇందులో చామంతి వాటర్‌ను కూడా పోసి మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్రమాన్ని ముఖానికి కాస్త మందంగా అప్లై చేసి.ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
పూర్తిగా డ్రై అయిన అనంతరం గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకుని ఏదైనా మాయిశ్చరైజర్ రాసుకోవాలి.ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే ఎలాంటి మొటిమలైనా, మచ్చలైనా తగ్గిపోయి ముఖం అందంగా, కాంతివంతంగా మారుతుంది.