మహేష్ బాబు హీరోగా పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సర్కారు వారి పాట మిక్స్డ్ టాక్ తో ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతోంది.ఈ సినిమా తొలిరోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించిందని ఈ సినిమా కలెక్షన్లు చెబుతున్నాయి.
టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.సర్కారు వారి పాట ఫస్ట్ వీకెండ్ నాటికి కనీసం 50 శాతం రికవరీ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
హైదరాబాద్ లో ఈ సినిమా బుకింగ్స్ బాగానే ఉన్నాయని అయితే టైర్2, టైర్3 ప్రాంతాలలో మాత్రం ఈ సినిమాకు బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవని సమాచారం అందుతోంది.సర్కారు వారి పాట మేకర్స్ ప్రమోషన్స్ లో వేగం పెంచి సినిమాను హిట్ ట్రాక్ లోకి చేరుస్తారేమో చూడాలి.
అయితే సర్కారు వారి పాట సినిమా కథ, కథనంలో మాత్రం చాలా పెద్ద తప్పులు ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
సర్కారు వారి పాట సినిమాలో కళావతి పాత్రలో నటించిన కీర్తి సురేష్ మొదట మహేష్ నుంచి 10,000 డాలర్లు అప్పుగా తీసుకుంటుంది.

ఆ తర్వాత మళ్లీ పాతిక వేలు అడుగుతుంది.మహేష్ ఆ మొత్తం కూడా కళావతికి అప్పు ఇస్తాడు.అయితే సినిమాలో మహేష్ ఆ తర్వాత 10,000 డాలర్ల గురించి అడుగుతాడే తప్ప మిగతా డబ్బుల గురించి అడగడు.10,000 డాలర్లను వసూలు చేయడానికి ఇండియాకు వచ్చిన హీరో ఆ మొత్తం వసూలు చేసుకున్నట్టు కూడా సినిమాలో చూపించారు.

అప్పు గురించి చూపించే సీన్ల విషయంలో పరశురామ్ తడబాటుకు గురయ్యారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఎంపీ కూతురు తక్కువ మొత్తం అప్పు చేయడంతో పాటు ఆ అప్పు కట్టలేని స్థితి ఉండటం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.దర్శకుడు పరశురామ్ సినిమాలో లాజిక్ కు అందని సీన్లను ఎక్కువగా పెట్టారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.