ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.అనతికాలంలోనే దేశంలోని దాదాపు 40 శాతం మంది ప్రజలు జియోలో కస్టమర్లుగా చేరారు.అయితే ఇప్పుడు ఈ సంస్థ తన కస్టమర్లను భారీగా కోల్పోతోంది.2022 ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్ క్వార్టర్ లో జియో సంస్థ ఏకంగా కోటి 9 లక్షల మంది యూజర్లను కోల్పోయింది.జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో కోటి మందికిపైగా యూజర్లను కోల్పోవడమంటే జియోపై భారీ దెబ్బ పడినట్లేనని టెక్ నిపుణులు చెబుతున్నారు.
జియో తాజాగా 2022 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి సంబంధించిన రిజల్ట్స్ ప్రకటించింది.
ఈ రిజల్ట్స్ లో యూజర్ల సంఖ్య తగ్గినప్పటికీ తమ ఆదాయం పెరిగినట్టు జియో పేర్కొంది.ప్రస్తుతం జియో యూజర్ల సంఖ్య 41.02 కోట్లుగా ఉంది.డిసెంబర్‌లో ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచిన తర్వాత కస్టమర్ల సంఖ్య మరింత ఎక్కువగా తగ్గుతూ వస్తోంది.
ఆ సమయం నుంచి జియో కస్టమర్ల సంఖ్య పెరిగిన దాఖలాలు లేవంటే అతిశయోక్తి కాదు.అయితే ఇదే త్రైమాసికంలో రూ.4,173 కోట్ల నికర లాభం వచ్చింది.రూ.26,139 కోట్ల స్థూల ఆదాయం లభించింది.2022 ఆర్థిక సంవత్సరంలో జియో అన్ని ప్లాట్‌ఫామ్స్ ప్రాఫిట్ రూ.15,487 కోట్లకు ఎగబాకింది.2021 ఫైనాన్షియల్ ఇయర్ తో పోల్చుకుంటే 23.6 శాతం వృద్ధి నమోదయింది.
అయితే ఈ స్థాయిలో లాభం పొందడానికి గల కారణం రెవిన్యూ పర్ యావరేజ్ యూజర్ పెరగడమే.
సగటు వినియోగదారుడి నుంచి రెవిన్యూ పెరుగుతూ వస్తోంది కాబట్టి యూజర్ల సంఖ్య తగ్గినా కూడా జియోకి ప్రాఫిట్స్ మిగులుతున్నాయి.ప్రస్తుతం జియో కస్టమర్ల నుంచి రూ.167.6 ప్రాఫిట్ పొందుతోంది.