ప్రెసెంట్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మొదటి సినిమా ‘లైగర్‘.ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న లైగర్ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.
ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 25న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.
ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది.దీంతో బిజినెస్ పరంగా కూడా భారీ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది.
అయితే ఈ సినిమా అప్డేట్ కోసం లైగర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా పూరీ జగన్నాథ్ ఈ సినిమా నుండి ఒక సర్ప్రైజ్ ఉంది అంటూ ఒక అప్డేట్ ఇచ్చాడు.
విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా మే 9న సాయంత్రం 4 గంటలకు ఒక సాలిడ్ అప్డేట్ రానుందని తెలిపాడు.వార్నింగ్.
హి ఈజ్ రెడీ టు స్టార్ట్ హంటింగ్’ అంటూ అప్డేట్ ఇచ్చారు.

ఇందుకు రౌడీ స్టార్ ఫాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు.అలాగే పూరీ జగన్నాథ్ మీద కోపంగా కూడా ఉన్నారట.అసలు విజయ్ ఫ్యాన్స్ ఫైర్ అవ్వడానికి కారణం ఏంటంటే.
పూరీ ఇచ్చిన అప్డేట్ లో సమాచారం కరెక్ట్ గా ఇవ్వలేదట.ఈ సినిమా నుండి పోస్టర్ నా.పాట నా.ట్రైలర్ నా అనేది తెలియక ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.ఆ విషయం చెబితే బాగుండేది కదా అని ఉసురు మంటున్నారు.మరి కాదా అసలే రాకరాక విజయ్ సినిమా అప్డేట్ వస్తుంది.కానీ ఇలా సగం సగం చెప్పడంతో ఫైర్ అవుతున్నారు.