ఈ విధంగా వాకింగ్ చేస్తే సూప‌ర్ ఫాస్ట్‌గా బ‌రువు త‌గ్గుతారు..తెలుసా?

వాకింగ్‌.సుల‌భ‌మైన, తేలికైన‌ మ‌రియు అద్భుత‌మైన వ్యాయామం ఇది.రెగ్యుల‌ర్‌గా ఓ గంట పాటు వాకింగ్ చేస్తే ఆరోగ్యం ప‌దిలంగా ఉంటుందని నిపుణులు ఎప్ప‌టిక‌ప్పుడు చెబుతూనే ఉంటారు.అందుకే చాలా మంది వాకింగ్‌ను త‌మ డైలీ రొటీన్‌లో చేర్చుకుంటారు.

 If You Walk Like This, You Will Lose Weight Super Fast , Lose Weight, Walk, Walk-TeluguStop.com

అందులోనూ ముఖ్యంగా బ‌రువు తగ్గ‌డం కోసం వాకింగ్ చేసే వారు ఎంద‌రో ఉంటారు.అయితే వెయిట్ లాస్ అవ్వాల‌ని ప్ర‌య‌త్నించే వారు.

నార్మ‌ల్ వాక్ కాకుండా ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా వాకింగ్ చేస్తే సూప‌ర్ ఫాస్ట్‌గా బ‌రువు త‌గ్గొచ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం ప‌దండీ.

వాకింగ్ చేసేట‌ప్పుడు క్యాజువల్ గా నడవడం కాకుండా కొంత బ‌రువును ఎత్తుకుని న‌డ‌వండి.అంటే ఏదైనా బ‌రువున్న‌ వ‌స్తువును రెండు చేతుల‌తో ప‌ట్టుకుని వాకింగ్ చేయండి.ఇలా చేయ‌డం వ‌ల్ల కండ‌రాలపై ఒత్తిడి పెరిగి శ‌రీరంలో కేల‌రీలు త్వ‌ర‌గా క‌రుగుతాయి.దాంతో వేగంగా బ‌రువు త‌గ్గుతారు.

అలాగే వెయిట్ లాస్ అవ్వాల‌ని భావించే వారికి బ్రిస్క్ వాకింగ్ చాలా హెల్ప్ చేస్తుంది.స్పీడ్ గా నడవడాన్ని బ్రిస్క్ వాకింగ్ అని అంటారు.ఇది రన్నింగ్‌ చేసినంతటి ఫలితాన్ని అందిస్తుంది.రెగ్యుల‌ర్ ఓ ఇర‌వై లేదా ముప్పై నిమిషాల పాటు బ్రిస్క్ వాకింగ్ చేస్తే త్వరగా బరువు తగ్గుతారని కొన్ని పరిశోధనల ద్వారా తేలింది.

అలాగే గుండె జ‌బ్బులు, మ‌ధుమేహం వంటి వ్యాధులు వ‌చ్చే ప్ర‌మాదం సైతం త‌గ్గుతుంది.

Telugu Tips, Latest, Lose, Walk-Telugu Health Tips

అప్‌హిల్ క్లైంబ్‌.అంటే ఎత్తైన ప్రాంతాలకు వాకింగ్ చేయడం.తొంద‌ర‌గా వెయిట్ లాస్ అవ్వాల‌నుకునే వారు ఎత్తైన ప్రాంతాలకు వాకింగ్ చేస్తే చాలా మంచి ఫ‌లితం ఉంటుంది.

అలాగే అప్‌హీల్ క్లైంబ్ వ‌ల్ల ఒత్తిడి దూరం అవుతుంది.మాన‌సిక ఎదుగుల ఇంఫ్రూవ్ అవుతుంది.కండ‌రాలు దృఢంగా కూడా మార‌తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube