టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు హీరో లుగా రూపొందిన ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ విజువల్ వండర్ అంటూ టాక్ ను దక్కించుకుంది.బాహుబలి 2 రేంజ్ లో ఈ సినిమా వసూళ్లు దక్కించుకుంటుంది అంటూ ప్రతి ఒక్కరు నమ్మకం వ్యక్తం చేశారు.
కాని అనూహ్యంగా సినిమా ఆ స్థాయి వసూళ్లు చేయడం లేదని క్లారిటీ వచ్చింది.
కాని ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లు నమోదు చేయడం మాత్రం పక్కా అని ఇప్పటికే క్లారిటీ వచ్చింది.
దేశ వ్యాప్తంగా ఈ సినిమాకు సంబంధించిన వసూళ్లు మూడవ వారంలో కూడా కుమ్మేస్తున్నాయి.ఈమద్య కాలంలో ఎంత పెద్ద సక్సెస్ మూవీ అయినా మొదటి వారం రోజులు మహా అయితే రెండవ వీకెండ్ లో వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.
కాని ఈ సినిమా మాత్రం ఏకంగా మూడవ వారంలో కూడా కుమ్మేస్తుంది.
నిన్న మొన్న అంటే మూడవ శని మరియు ఆదివారాల్లో ఈ సినిమా వసూళ్ల జోరు చూసి తెలుగు సినీ విశ్లేషకులు మాత్రమే కాకుండా బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు కూడా నోరు వెళ్లబెట్టారు అనడంలో సందేహం లేదు.
అద్బుతమైన వసూళ్లను దక్కించుకోవడం తో పాటు లాంగ్ రన్ లో ఈ సినిమా మరింత వసూళ్లు చేసే అవకాశాలు ఉన్నాయంటూ టాక్ వినిపిస్తుంది.

విజువల్ వండర్ గా ఉన్న ఈ సినిమా ను అమెరికా నుండి అనకాపల్లి వరకు ప్రతి ఒక్కరు కూడా థియేటర్ ద్వారా చూడాలని ఉబలాట పడుతున్నారు.అందుకే అన్ని చోట్ల కూడా రికార్డు బ్రేకింగ్ వసూళ్లను ఈ సినిమా నమోదు చేస్తుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఈ సినిమా రా బడుతున్నా కలెక్షన్స్ ను చూసి ఏకంగా హాలీవుడ్ మీడియా వర్గాల వారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లు గా సమాచారం అందుతోంది.