నెమ్మదించిన ఆర్ఆర్‌ఆర్‌... ఈ రెండు రోజుల తర్వాత మొత్తం డౌన్‌!

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కించిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా విడుదల అయ్యి వెయ్యి కోట్ల వసూళ్లను దక్కించుకుంది.బాహుబలి 2 సినిమా రూ.1800 కోట్ల వసూళ్లను దక్కించుకున్న విషయం తెల్సిందే.ఆ సినిమా తర్వాత మళ్లీ ఆ స్థాయి లో ఈ సినిమా దక్కించుకుంటుందని అంతా భావించారు.

 Ram Charan Ntr Film Rrr Collections News Details, Rrr, Ram Charan, Ntr, Rajamoul-TeluguStop.com

కాని వసూళ్ల విషయం లో మొదటి రోజే కాస్త డివైడ్ టాక్ వచ్చింది.ఈ సినిమా 1800 కోట్ల రూపాయలు కాదు కాని కనీసం రూ.1000 కోట్ల వసూళ్లు సాధిస్తే గొప్ప విషయం గా అంతా భావించారు.కాని చాలా ఈజీగా ఈ సినిమా వెయ్యి కోట్ల వసూళ్ల ను దక్కించుకుని రాజమౌళి స్టామినా ను నిరూపించింది.

అద్బుతమైన ఆర్‌ ఆర్ ఆర్‌ కు రెండు వారాల పాటు ఏక ధాటిగా వసూళ్లు నమోదు అయ్యాయి.వెయ్యి కోట్ల రూపాయలను కేవలం 11 రోజుల్లోనే రాబట్టినట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ సినిమా లాంగ్‌ రన్ లో 1300 నుండి 1400 కోట్ల వరకు వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ప్రతి ఒక్కరు భావించారు.కాని రెండు వారాలు ముగిసిన తర్వాత సినిమా వసూళ్లు నెమ్మదించాయి.

ఈ శని మరియు ఆది వారాల్లో వసూళ్లు కాస్త ఎక్కువగానే ఉంటాయి.

Telugu Ajay Devgan, Alia Bhatt, Bahubali, Rajamouil, Olivia Morris, Rajamouli, R

కాని ఎల్లుండి సోమ వారం నుండి ఖచ్చితంగా వసూళ్లు మరీ దారుణంగా ఉండే అవకాశం ఉందంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయినా ఈ మద్య కాలంలో సినిమా లు వారం రోజులు భారీ వసూళ్లు రాబట్టి రెండవ వారం లో కనిపించకుండా పోతున్నాయి.కాని రెండు వారాలు పూర్తి చేసుకుని మూడవ వారంలో వీకెండ్‌ లో కూడా ఈ సినిమా ఆడటం అంటే మామూలు విషయం కాదు.

ఆర్ ఆర్ ఆర్‌ సినిమా లాంగ్‌ రన్‌ లో 1200 కోట్ల వరకు రాబట్టే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు టాక్ వినిపిస్తుంది.ఏదైనా అద్బుతం జరిగితే తప్ప అంతకు మించి వసూళ్లు నమోదు కాకపోవచ్చు అంటున్నారు.240 కోట్ల వరకు హిందీ వర్సన్‌ రాబట్టే అవకాశం ఉందంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube