రామ్ పోతినేని.ఈయన పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు లేరు.
ఇంతకు ముందు అమ్మాయిల కలల రాకుమారుడిలా ఉండేవాడు.కానీ ఇప్ప్పుడు ఇష్మార్ట్ శంకర్ సినిమాతో ఆయన తన లుక్ ని పూర్తిగా మార్చి చాకొలేట్ బాయ్ కాస్త యాక్షన్ హీరోగా మారిపోయి మాస్ ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు.
ఈ సినిమా ఇచ్చిన జోష్ తో రామ్ మరిన్ని యాక్షన్ సినిమాలనే ఎంచుకుంటూ మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యి మాస్ హీరో అనిపించు కోవడానికి బాగా ట్రై చేస్తున్నాడు.
ప్రెసెంట్ రామ్ కోలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ సినిమా చేస్తున్నాడు.
ఇది ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతుంది.రామ్ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలికే ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.
ఈ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్ అందరిని ఆకట్టుకున్నాయి.రామ్ తొలిసారి పోలికే యూనిఫామ్ వేసుకుంటున్నాడు.
ఇప్పటికే ఆయన తన పోలికే లుక్ తో ఆకట్టుకున్నాడు.ఇక ఇప్పుడు మరోసారి రామ్ లుక్ ను వదిలారు మేకర్స్.ఈ రోజు ఉగాది పండుగ సందర్భంగా రామ్ పోస్టర్ ను రివీల్ చేసారు.ఇందులో రామ్ పోలీస్ యూనిఫామ్ వేసుకుని మరింత స్టైలిష్ లుక్ లో బులెట్ బైక్ నడుపుతూ యాటిట్యూడ్ లుక్ లో అగ్రెసివ్ గా కనిపిస్తున్నాడు.
ఈ పోస్టర్ ఇప్పుడు రామ్ అభిమానులను ఆకట్టుకుంటుంది.ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తూ ఉండగా.కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను జులై 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు ఇటీవలే మేకర్స్ అనౌన్స్ చేసారు.పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
ది వారియర్ సినిమాతో రామ్ కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.మరి ఈయన ఈ సినిమాతో ఇక్కడ అక్కడ రెండు చోట్ల విజయం అందుకుంటాడో లేదో చూడాలి.