ఏపీ జనాల్లో మాస్ ఇమేజ్ తెచ్చుకున్న వైసీపీ అధినేత, సీఎం జగన్ రూటే సపరేటు.ఆయన ఏది చేసినా రోటీన్‌కు భిన్నంగా ఉంటుంది.
ఒక్కసారి ఆయన డిసైడ్ అయితే అవతలి వారు పాటించాల్సిందే.ఇప్పటి వరకు ఇదే జరుగుతూ వచ్చింది.
ప్రస్తుతం ఫస్ట్ టైమ్ జగన్ మైండ్ సెట్ మారినట్టు కనిపిస్తోంది.తనతోపాటు 34నెలలపాటు పనిచేసి మాజీలు అవుతున్న మంత్రులతో లంచులు, డిన్నర్లకు రెఢీ అవుతుండడం విశేషం.
అంతేకాదు వారితో మనసు విప్పి మాట్లాడబోతున్నారని, సిట్టింగులు వేయబోతున్నట్టు టాక్. అంటే జగన్ తన స్టైల్‌కు భిన్నంగా కొత్తగా ముందుకువెళ్తున్నాడన్నమాట.
ఏప్రిల్ 11న మంత్రి వర్గణ విస్తరణ ఉందనుకుంటే ఇప్పటి నుంచి పట్టుమని పది రోజులు కూడా లేదు.ఈ సమయంలోనే వారితో ముఖాముఖి కానున్నట్టు సమాచారం.మాజీలయ్యే మంత్రులతో జగన్ వరుస భేటీలు నిర్వమించనున్నారని, ఈ నెల 7, 8 తేదీల్లో ఒక్కక్కరిగా ముఖాముఖి అవుతారని సమాచారం.అయితే వారి మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారు.
వారికేమైనా ఇబ్బందులు గానీ, అసంతృప్తిగానే ఉంటే వాటిని సంధికుదిర్చే పనిలో పడతారన్నమాట.పార్టీ పదవులతోపాటు, ప్రాధాన్యత ఇస్తామని చెబుతారని టాక్.
ఒకవిధంగా చెప్పాలంటే జగన్ స్టైల్‌కు ఇది భిన్నమనే చెప్పాలి.ఇప్పటి వరకు ఆయన ఎప్పుడు ఇలాంటీ భేటీలు చేపట్టలేదు.
ఈనేపథ్యంలో జగన్ నిర్ణయాలు ఆకట్టుకునేలా ఉన్నాయి.

కాగా వచ్చే ఎన్నికలు వైసీపీకి అత్యంత కీలకం.మూడేండ్ల పాలనలో సహజంగా వ్యతిరేకత రావడం సర్వసాధారణం.ఇన్నాండ్లు మంత్రులుగా పనిచేసిన వారు మాజీలు అయిన తరువాత అసమ్మతి గళం విప్పితే కొత్త చిక్కులు తప్పవు.
ఒకవిధంగా చెప్పాలంటే బాబు మాదిరిగా ఇంటర్నల్‌గా ఉండాల్సి వస్తుంది.మొత్తంగా జగన్ మార్పు రాజకీయంగా మంచిదేనని చెప్పొచ్చు.మరి జరగబోయే చర్చల్లో మాజీలు కాబోతున్న వారు ఏం చెబుతారో వేచి చూడాలి.