తెలుగు సంవత్సరాది సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు సంబంధించి పలు అంశాలను సందేశం రూపంలో అందించారు.
భారత సంస్కృతి వారసత్వం గొప్పదని కొనియాడారు.ప్రస్తుత ప్రపంచంలో ఇండియా ఎదుగుదల చూసి పాశ్చాత్య దేశాలు అసూయ చెందుతున్నాయని తెలిపారు.
చట్టసభల్లో సభ్యుల ప్రవర్తన హుందాగా ఉండాలని సూచించారు.
అంతమాత్రమే కాదు సాంఘిక వివక్ష పాటించకూడదు అని.ఆ రీతిగా ప్రతిజ్ఞ చేయాలని కీలక అంశాన్ని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.ఎప్పుడైనా కులం కంటే గుణం మిన్న అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని సూచించారు.
ఉనికిని కాపాడుకోవటానికి ప్రయత్నించాలని తెలిపారు.మాతృభాషలోనే మాట్లాడాలన్నా నియమం పెట్టుకోవాలని.
మాతృభాష రాకుంటే అంతకు మించిన దారుణం మరొకటి ఉండదని వెంకయ్యనాయుడు సంచలన కామెంట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా.
ముఖ్య మంత్రులు మరియు వివిధ పార్టీల నేతలు ఉగాది వేడుకలు ఘనంగా జరిపారు.







