మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసినందుకు మరణశిక్షకు గురైన భారత సంతతికి చెందిన నాగేంద్రన్ కె ధర్మలింగం చేసుకున్న చివరి అప్పీల్‌ను సింగపూర్ సుప్రీంకోర్ట్ మంగళవారం తీసుకొచ్చింది అంతేకాదు అతని మరణశిక్షకు ఆమోదముద్ర వేసింది.తమ చివరి అవకాశం కూడా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకపోవడంతో నాగేంద్రన్ కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
సింగపూర్‌కు 42 గ్రాముల హెరాయిన్ సరఫరా చేశాడని నాగేంద్రన్‌పై 2009లో అభియోగాలు నమోదయ్యాయి.అనంతరం అవి నిర్థారణ కావడంతో 2010లో ఆయనకు కోర్ట్ మరణశిక్ష విధించింది.
దీంతో ధర్మలింగం న్యాయస్థానాల్లో పలుమార్లు అప్పీళ్లు చేసుకున్నప్పటికీ ఫలితం దక్కలేదు.చివరకు సింగపూర్ అధ్యక్షుడిని క్షమాభిక్ష కోరినన్నప్పటికీ అక్కడా నిరాశే ఎదురైంది.11 ఏళ్ల క్రితం పడిన మరణశిక్ష గతేడాది నవంబర్ 10వ తేదీన అమలు కావాల్సి ఉంది.అయితే నాగేంద్రన్‌కు కొవిడ్ సోకడం, మానసిక అంగవైకల్యం కారణంగా మరణశిక్ష మరోసారి వాయిదా పడింది.
ఊహించని పరిణామాలు చోటుచేసుకోవడంతో ఈ కేసుపై ఆసక్తి పెరిగింది.దీంతో ఇవాళ్టీ విచారణ సందర్భంగా కోర్టు ప్రాంగణం మొత్తం అంతర్జాతీయ మీడియా, స్థానిక ఆందోళనకారులతో కిక్కిరిసిపోయింది.
మానసిక వైకల్యం వున్న వారిని ఉరితీయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని వాదిస్తూ నాగేంద్రన్ తరపు న్యాయవాదులు చివరి అప్పీల్‌ను దాఖలు చేశారు.కానీ న్యాయస్థానం దీనిని తిరస్కరించింది.
సింగపూర్ ప్రధాన న్యాయమూర్తి సుందరేష్ మీనన్ స్పందిస్తూ.దీనికి చట్టపరమైన ఆధారం లేదన్నారు.
అంతర్జాతీయ చట్టం కంటే దేశీయ చట్టానికే ప్రాధాన్యత వుంటుందని సుందరేష్ పేర్కొన్నారు.నాగేంద్రన్‌కు తగిన న్యాయ ప్రక్రియను అందించామని ఆయన అన్నారు.
తీర్పు సందర్భంగా ఊదారంగు జైలు దుస్తులను, ముఖానికి తెల్లటి మాస్క్‌ను ధరించి నాగేంద్రన్ ముభావంగా కనిపించాడు.ఈ కేసులో అతనికి సహాయం చేస్తున్న మానవ హక్కుల న్యాయవాది ఎం.రవి మాట్లాడుతూ.ఇకపై అప్పీళ్లు దాఖలు చేయబోమని, రెండ్రోజుల్లో ఉరిశిక్ష అమలు జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ తీర్పుతో తాము షాక్‌కు గురైనట్లు చెప్పారు నాగేంద్రన్ సోదరి షర్మిల.అతి దీర్ఘకాల కేసు తమకు భయంకరమైన పరీక్ష అని ఆమె వ్యాఖ్యానించారు.