రోజాను అవమానించిన కెవ్వు కార్తీక్... అందరి ముందు సీరియస్ అయిన రోజా?

బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమాలకు స్పెషల్ అట్రాక్షన్ గా రోజా నిలిచారు.గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న రోజా మాటే వేదవాక్కు గా ఉంటుంది.

 Kevvu Karthik Insulted Roja Roja Is Serious In Front Of Everyone, Roja, Kevvu Ka-TeluguStop.com

ఈ కార్యక్రమంలో రోజా కంటెస్టెంట్ ల కంటే ముందుగా వారిపై పంచులు వేస్తూ అందరినీ సందడి చేస్తుంటారు.తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.

ఈ కార్యక్రమంలో భాగంగా రోజా కూడా స్కిట్ చేశారు.జడ్జెస్ కి ట్రైనింగ్ ఇవ్వబడును అంటూ ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టారు.

Telugu Insult, Jabardasth, Kevvu Karthik, Kevvukarthik, Roja-Movie

రోజా దగ్గర ట్రైనింగ్ తీసుకోవడానికి హీరోయిన్స్ ఆమని, లైలా వస్తారు.వీరిద్దరికి రోజా జడ్జిమెంట్ ఎలా ఇవ్వాలో ట్రైనింగ్ ఇస్తుంది.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా శాంతి స్వరూప్ కెవ్వుకార్తిక్ ఇద్దరు స్టేజి పైకి వచ్చి స్కిట్ చేస్తారు.ఈ స్కిట్ లో భాగంగా కెవ్వుకార్తిక్ శాంతిస్వరూప్ ను రోజాతో పోలుస్తూ నువ్వు కనుక మేకప్ తీసేస్తే… అచ్చం రోజాలా ఉంటావు అంటూ తన పై సెటైర్ వేశారు.

కెవ్వుకార్తిక్ ఈ విధంగా తనగురించి సెటైర్ వేయడంతో రోజా ఒక్కసారిగా సీరియస్ అవుతుంది.

Telugu Insult, Jabardasth, Kevvu Karthik, Kevvukarthik, Roja-Movie

ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ… ఏయ్ నవ్వుతున్నాం కదా? అని ఏదంటే అది జోక్స్ వేసేస్తావా?.ముగ్గురు జడ్జ్‌లను పిలిచినప్పుడు కంటెంట్ ఎంత బాగుండాలి.ఏదో ఒక పిచ్చి డైలాగు చెబితే చూసేస్తామని అనుకుంటున్నావా అంటూ అక్కడి నుంచి కోపంగా లేచి వెళ్లి పోవాలని చూస్తుంది.

ఇలా రోజా లేచి వెళ్లిపోవడానికి ప్రయత్నించడంతో సెట్ లో ఉన్న వారందరూ ఒక్కసారిగా షాకయ్యారు.దీంతో వెంటనే ఆమని కంగారుగా అయ్యో మేడం ఏంటి అలా వెళ్ళిపోతున్నావు అని అడుగగా వెంటనే రోజా మనకు ఎప్పుడైనా బ్రేక్ కావాలంటే ఇలా చేసి వెళ్లిపోవాలని ఆమనీకి సైగ చేస్తుంది.

అయితే ఇది కూడా వీరి భాగమేనని తెలియడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు.ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube