సోషల్ మీడియా చెత్త రూమర్లకు చెక్ పెట్టిన నిహారిక భర్త.. ఏం చేశారంటే?

కొన్ని రోజుల క్రితం మెగా డాటర్ నిహారిక ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను డిలీట్ చేసి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసిన సంగతి తెలిసిందే.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిహారిక ఇన్ స్టాగ్రామ్ కు దూరం కావడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.

 Niharika Husband Shared Photo Goes Viral In Social Media Details, Chaitanya Jonn-TeluguStop.com

వైరల్ అయిన ఒక వీడియో వల్లే నిహారిక ఇన్ స్టాగ్రామ్ కు దూరం కావాల్సి వచ్చిందని జోరుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.అయితే నిహారిక ఇన్ స్టాగ్రామ్ కు దూరమైన తర్వాత ఆమె పర్సనల్ లైఫ్ ను టార్గెట్ చేస్తూ కొన్ని కథనాలు ప్రచురితమయ్యాయి.

నిహారికకు ఆమె భర్తకు మధ్య విభేదాలు తలెత్తాయని అత్తింటి వారు నిహారికపై సీరియస్ అయ్యారంటూ చెత్త రూమర్లు ప్రచారంలోకి రాగా ఆ రూమర్లను మెగాభిమానులు సైతం నమ్మలేదు.అయితే నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డ వైరల్ అవుతున్న రూమర్లకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేశారు.

నిహారిక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా వైరల్ అవుతున్న రూమర్లకు చైతన్య చెక్ పెట్టారు.

తాము చాలా సంతోషంగా ఉన్నామని చైతన్య చెప్పకనే చెప్పేశారు.

Telugu Divorce, Niharika, Rumors, Shared-Movie

నిహారిక ఇన్ స్టాగ్రామ్ కు దూరం కావడానికి గల కారణాన్ని కూడా చైతన్య వెల్లడించి ఉంటే బాగుండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు నిహారిక ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించని నిహారిక వెబ్ సిరీస్ లకు నిర్మాతగా వ్యవహరిస్తూ విజయాలను అందుకుంటున్నారు.

Telugu Divorce, Niharika, Rumors, Shared-Movie

గతేడాది నిహారిక నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్ జీ5 యాప్ లో విడుదలై సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.నిహారిక మళ్లీ ఇన్ స్టాగ్రామ్ లోకి రావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.మెగా డాటర్ నిహారిక పలు టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరించి ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube