సోషల్ మీడియా చెత్త రూమర్లకు చెక్ పెట్టిన నిహారిక భర్త.. ఏం చేశారంటే?

కొన్ని రోజుల క్రితం మెగా డాటర్ నిహారిక ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను డిలీట్ చేసి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసిన సంగతి తెలిసిందే.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిహారిక ఇన్ స్టాగ్రామ్ కు దూరం కావడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.

వైరల్ అయిన ఒక వీడియో వల్లే నిహారిక ఇన్ స్టాగ్రామ్ కు దూరం కావాల్సి వచ్చిందని జోరుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే నిహారిక ఇన్ స్టాగ్రామ్ కు దూరమైన తర్వాత ఆమె పర్సనల్ లైఫ్ ను టార్గెట్ చేస్తూ కొన్ని కథనాలు ప్రచురితమయ్యాయి.

నిహారికకు ఆమె భర్తకు మధ్య విభేదాలు తలెత్తాయని అత్తింటి వారు నిహారికపై సీరియస్ అయ్యారంటూ చెత్త రూమర్లు ప్రచారంలోకి రాగా ఆ రూమర్లను మెగాభిమానులు సైతం నమ్మలేదు.

అయితే నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డ వైరల్ అవుతున్న రూమర్లకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేశారు.

నిహారిక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా వైరల్ అవుతున్న రూమర్లకు చైతన్య చెక్ పెట్టారు.

తాము చాలా సంతోషంగా ఉన్నామని చైతన్య చెప్పకనే చెప్పేశారు. """/" / నిహారిక ఇన్ స్టాగ్రామ్ కు దూరం కావడానికి గల కారణాన్ని కూడా చైతన్య వెల్లడించి ఉంటే బాగుండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు నిహారిక ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.

హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించని నిహారిక వెబ్ సిరీస్ లకు నిర్మాతగా వ్యవహరిస్తూ విజయాలను అందుకుంటున్నారు.

"""/" / గతేడాది నిహారిక నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్ జీ5 యాప్ లో విడుదలై సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.

నిహారిక మళ్లీ ఇన్ స్టాగ్రామ్ లోకి రావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.మెగా డాటర్ నిహారిక పలు టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరించి ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే.

సోషల్ మీడియా కార్యకర్తల కోసం రంగంలోకి జగన్ .. వీరికే ఆ బాధ్యతలు