పటాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న కమెడియన్లలో ప్రవీణ్ ఒకరు.జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల ద్వారా ప్రవీణ్ క్రేజ్ ను మరింత పెంచుకున్నారు.
ప్రవీణ్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో తన నాన్నను స్టేజ్ పైకి తీసుకొచ్చి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.తాను ఈరోజు ఈ స్టేజ్ లో నిలబడ్డానంటే నాన్నే కారణమని ప్రవీణ్ అన్నారు.9 సంవత్సరాల వయస్సులో అమ్మ చనిపోయిందని ప్రవీణ్ తెలిపారు.
అమ్మ చనిపోయిన తర్వాత నాన్న మరో పెళ్లి చేసుకోలేదని ప్రవీణ్ చెప్పుకొచ్చారు.
నాన్న లేకపోతే మేము లేమని అమ్మైనా నాన్నైనా అన్నీ నాన్నేనని ప్రవీణ్ చెప్పుకొచ్చారు.తనకు నాన్నే ఆస్తిపాస్తులు అని ప్రవీణ్ పేర్కొన్నారు.
కాలేయ సంబంధిత సమయతో ప్రవీణ్ తల్లి మరణించిందని ఆస్పత్రుల చుట్టూ తిప్పినా ఫలితం లేకపోయిందని పెద్దబ్బాయి వెటర్నరీ చదివాడని ఏపీ తెలంగాణ విడిపోవడం వల్ల అతనికి ఉద్యోగం రాలేదని ప్రవీణ్ తండ్రి తెలిపారు.
చెల్లి కూతురితో పెద్ద కొడుకుకు పెళ్లి చేశానని మా వదిన కడుపులో కూతురు పుడుతుందని మా నాన్న ఆశ అని ప్రవీణ్ తండ్రి చెప్పుకొచ్చారు.నేను హైదరాబాద్ కు వచ్చిన సమయంలో నాన్న అప్పు అడగటానికి వెళితే అప్పు ఇవ్వకుండా అవమానించారని ఆ సమయంలో నాన్న పురుగుల మందు తాగాలని అనుకున్నారని ప్రవీణ్ పేర్కొన్నారు.ప్రవీణ్ తన కెరీర్ లో ఎదుర్కొన్న కష్టాలను ఈ షో ద్వారా చెప్పుకొచ్చారు.
నాన్నను తొలిసారి ఈ షోకు తీసుకొచ్చానని ప్రవీణ్ పేర్కొన్నారు.గత ఆదివారం ఈ ఎపిసోడ్ ఈటీవీ ఛానల్ లో ప్రసారం కాగా ఈ ఎపిసోడ్ కు 45 లక్షల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.
సుధీర్ తన హోస్టింగ్ తో ఈ షో సక్సెస్ అయ్యేలా చేశారు.