యాంకర్ శ్యామలను ఆ పార్టీ టార్గెట్ చేశారా.. అసలు నిజం ఏమిటి?

బుల్లితెర యాంకర్ శ్యామల భర్త నరసింహ రెడ్డి పై గత ఏడాది చీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే.2017 నుంచి తనపై విడతలవారీగా కోటి రూపాయల వరకు అప్పుగా తీసుకుని, తిరిగి ఇవ్వాలని అడగగా బెదిరించడం తో పాటుగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అని ఒక బాధితురాలు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.ఇదే విషయం అప్పట్లో సంచలనంగా మారింది.ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా ఉన్న మహిళ కూడా సూచించింది అని తెలియడంతో రంగంలోకి దిగిన పోలీసులు శ్యామల భర్త ను అలాగే ఆ మహిళఫై కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

 Did Tdp Party Targeted Anchor Shyamala And His Husband Details, Anchor Shyamala-TeluguStop.com

అయితే ఆ వ్యవహారం ఆ తర్వాత ఏమైంది అన్నది తెలియదు.అటు సదరు మహిళ నుంచి కానీ, ఇది శ్యామల భర్త నుంచి కానీ ఎటువంటి స్పందన రాలేదు.

ఇదే విషయం పై శ్యామల స్పందిస్తూ తన భర్త తప్పు చేయడని, అంతే కాకుండా ఆయన మహిళ ఎవరు ఆ గొడవ ఏంటి అన్నది కూడా తనకు తెలియదని, మీడియాలో చూసిన తర్వాత నాకు ఆ విషయం తెలిసింది అని చెప్పుకొచ్చింది.శ్యామల భర్త నరసింహా రెడ్డి వైసిపి పార్టీ సానుభూతిపరులు గా ఉండటం, కాకుండా జగన్ తో కలిసి పాదయాత్రలో పాల్గొనడం ఫై తీవ్రంగా మండిపడిన టిడిపి పార్టీ.

శ్యామల భర్త నరసింహా రెడ్డి వైసీపీ తో కలిసి దిగిన ఫోటో ని షేర్ చేసి నేరగాళ్లకు వైసీపీ కండువా వీరతాడులా తొడుగుతారెమో అనుకుంటున్నారు.

ఎంతైనా కూడా ఆ పార్టీకి అవినీతి పునాది కదా అంటూ ట్వీట్ చేశారు టిడిపి పార్టీ నాయకులు.అంతేకాకుండా అధికారపార్టీ అండ చూసుకుని యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డి ఒక మహిళను రూ.కోటి మోసం చేసిందే కాకుండా, ఆమెను లైంగికంగా కూడా వేధించిన కేసులో అరెస్టయ్యాడు.గతంలో తెలుగుదేశం పై అడ్డగోలు ఆరోపణలు చేసి, ఎన్నికల ముందు వైసీపీలో చేరిన ఈ దంపతులు వివేకా హత్యపై నోరెత్తరేం? అంటూ ట్వీట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube