టీమ్ ఇండియా జట్టు గత కొంత కాలంగా సరైన ఆట ప్రదర్శన కనబర్చలేక ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో వెనుక బడి పోయింది.అయితే సరిగ్గా ఆరు సంవత్సరాల క్రితం టీమిండియా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టీ20ఐ ఫార్మాట్ టీమ్ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్ లో ఉంది.
ఆ తర్వాత మళ్ళీ భారత జట్టు ఆ స్థానాన్ని దక్కించు కున్న దాఖలాలు లేవు.అయితే తాజాగా రోహిత్ సేన మళ్లీ ఆ స్థానాన్ని సంపాదించి తమ సత్తా ఏంటో చూపుతోంది.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరేళ్ల తర్వాత టీమిండియా టాప్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టి నంబర్ వన్ స్థానానికి చేరుకోవడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
ఆదివారం అంటే ఫిబ్రవరి 21న వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు విజయకేతనం ఎగురవేసింది.3-0 తేడాతో భారత్ ఘనవిజయం సాధించడంతో ఇప్పుడు అది నంబర్‌వన్ స్థానానికి చేరుకుంది.269 రేటింగ్ పాయింట్స్ తో మన క్రికెట్ జట్టు ఇప్పుడు అగ్రస్థానంలో వెలుగొందుతోంది.అయితే అంతకు ముందు పొట్టి క్రికెట్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ప్లేస్ లో ఇంగ్లాండ్ జట్టు ఉండగా ఇప్పుడు అది రెండో స్థానానికి దిగ జారింది.వాస్తవానికి ఇంగ్లాండ్ టీం కూడా 269 రేటింగ్ పాయింట్లు సంపాదించింది.
అయితే 39 మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ (10,474) కంటే మన భారత (10,484) క్రికెట్ జట్టే ఎక్కువగా స్కోర్ సంపాదించింది.అందుకే టాప్ ప్లేస్ ఇండియాని వరించింది.
ఈ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 266 పాయింట్స్ తో పాకిస్థాన్ జట్టు థర్డ్ ప్లేస్ దక్కించుకుంది.టీమిండియా ఆటగాళ్లు 2016లో ఆఖరిగా నంబర్‌వన్‌గా నిలిచారు.ఈ స్థానాన్ని దాదాపు రెండు నెలలపాటు నిలుపుకున్నారు.ఆ తర్వాత ఫస్ట్ ప్లేస్ కోల్పోయి ర్యాంకింగ్స్‌లో చాలా వెనకబడి పోయారు.అయితే ఇటీవల జరిగిన చాలా మ్యాచ్ ల్లో టీమిండియా గెలిచింది.కొద్ది రోజుల క్రితం టీమిండియా 5-0 తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది.
అంతేకాదు 2-1 తేడాతో ఆ్రస్టేలియాపై, 3-2 తేడాతో ఇంగ్లండ్‌పై, 3-0 తేడాతో న్యూజిలాండ్‌పై, 3-0 తేడాతో వెస్టిండీస్‌పై టీమిండియా విజయాలు సాధించింది.ఇలా అనేక విజయాలతో ఇది టాప్ ప్లేస్ కి చేరుకుంది.