బాలీవుడ్ ని సౌత్ సినిమాలు ఏలుతున్నాయ్.. అజయ్ దేవ్‏గణ్ కామెంట్స్ వైరల్!

ప్రస్తుతం దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అద్భుతమైన చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్నాయి.ఈ క్రమంలోనే సౌత్ సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదల అయి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

 South Movies Are Making Fame In Bollywood Ajay Devgan Comments Viral , Ajay Devg-TeluguStop.com

అయితే ఈ విషయంపై బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఏడాదికి రెండు మూడు చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నటుడు అజయ్ దేవగన్ తాజాగా  ‘రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్’తో ఓటీటీలోకి అడుగుపెట్టనున్నాడు.

ఈ వెబ్ సిరీస్ త్వరలోనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.ఈ సందర్భంగా నటుడు అజయ్ దేవగన్ ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే రిపోర్టర్ అజయ్ దేవగన్ ను ప్రశ్నిస్తూ సౌత్ సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్నాయ్.దీనిపై మీ నిర్ణయం ఏంటి అని ప్రశ్నించగా అందుకు ఈయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా అజయ్ దేవగన్ మాట్లాడుతూ అలాంటి దేమీ లేదు కరోనా కారణం వల్ల సుమారు మూడు నెలల నుంచి థియేటర్లు మూత పడ్డాయి.అయితే ఇప్పుడు థియేటర్లు ఓపెన్ కాగానే ఏ సినిమా విడుదలైన ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తారు.ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కిన పెద్ద సినిమాలు విడుదల అయితే బాలీవుడ్ ఇండస్ట్రీని ఏ ఇండస్ట్రీ ఏలుతుందో తెలిసి పోతుంది అంటూ సమాధానం చెప్పారు.ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

South Movies Are Making Fame In Bollywood Ajay Devgan Comments Viral , Ajay Devgan , Bollywood , Hero , Comment , South Movie , Bollywood Industry , OTT , Disney Plus Hot Star - Telugu Ajay Devgan, Bollywood, Disney Hot

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube