బాలీవుడ్ ని సౌత్ సినిమాలు ఏలుతున్నాయ్.. అజయ్ దేవ్గణ్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
ప్రస్తుతం దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అద్భుతమైన చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్నాయి.
ఈ క్రమంలోనే సౌత్ సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదల అయి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
అయితే ఈ విషయంపై బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఏడాదికి రెండు మూడు చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నటుడు అజయ్ దేవగన్ తాజాగా ‘రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్’తో ఓటీటీలోకి అడుగుపెట్టనున్నాడు.
ఈ వెబ్ సిరీస్ త్వరలోనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సందర్భంగా నటుడు అజయ్ దేవగన్ ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే రిపోర్టర్ అజయ్ దేవగన్ ను ప్రశ్నిస్తూ సౌత్ సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్నాయ్.
దీనిపై మీ నిర్ణయం ఏంటి అని ప్రశ్నించగా అందుకు ఈయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
"""/" /
ఈ సందర్భంగా అజయ్ దేవగన్ మాట్లాడుతూ అలాంటి దేమీ లేదు కరోనా కారణం వల్ల సుమారు మూడు నెలల నుంచి థియేటర్లు మూత పడ్డాయి.
అయితే ఇప్పుడు థియేటర్లు ఓపెన్ కాగానే ఏ సినిమా విడుదలైన ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తారు.
ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కిన పెద్ద సినిమాలు విడుదల అయితే బాలీవుడ్ ఇండస్ట్రీని ఏ ఇండస్ట్రీ ఏలుతుందో తెలిసి పోతుంది అంటూ సమాధానం చెప్పారు.
ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కురుల ఆరోగ్యాన్ని పెంచే కాఫీ.. ఎలా వాడాలో తెలుసా?