టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే.ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉన్న మహేష్ బాబు ఈ సినిమా పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ సినిమాలో పాల్గొనబోతున్నారు.
ఇప్పటికే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రావడం పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకోవడం పూర్తయింది.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్.
ఇక మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రీకరణ పూర్తి కాగానే త్రివిక్రమ్ సినిమాలో పాల్గొన బోతున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి ఓ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ సెంటిమెంట్ ప్రకారం తన సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారనే విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ సినిమాలో తొలి ప్రాధాన్యత పూజా హెగ్డేకి ఇవ్వగా మరొక హీరోయిన్ పాత్ర కోసం ఆయన ఎంతో మంది హీరోయిన్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఇప్పటికీ పలువురి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇదిలా ఉండగా తాజాగా మరొక హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది.పెళ్లి సందD సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ శ్రీలీలా ను మరొక పాత్రలో తీసుకోవాలని త్రివిక్రమ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈమెతో చర్చలు జరపగా మహేష్ బాబు సినిమాలో నటించడానికి ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.