రామ్ గోపాల్ వర్మ అంటేనే మనసులోని మాటను నిర్మొహమాటంగా బయటికి చెప్పే వ్యక్తి.వివాదాలకు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ.
ఈ డైరెక్టర్ ఎప్పుడూ కూడా సమాజంలో జరిగే పరిణామాల ఆధారంగా సినిమాలను తీస్తూ ఉంటారు.రామ్ గోపాల్ వర్మ అమ్మాయిల మీద రొమాంటిక్ కామెంట్ చేయడంలో మొదటగా ఉంటారు.
అయినా వెళ్ళిన షోస్ లో కానీ, మరే ఇతర ప్రోగ్రామ్స్ లలో అయినా సరే అమ్మాయిల మీద మొదటగా ఫన్నీ కామెంట్స్ చేస్తూ ఉంటారు.
ఈ డైరెక్టర్ బయట ఎంత రొమాంటిక్ గా కనిపించిన, తన సినిమాలలో మాత్రం రొమాంటిక్ సీన్స్ ఏవీ ఉండవు.
ఈ క్రమంలోనే ఆర్జీవి డైరెక్ట్ చేసిన మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ శ్యామల పై తను ఒక రాస్కెల్ అంటూ యాంకర్ శ్యామల అందం గురించి తెగ పొగిడారు.యాంకర్ శ్యామల వేదికపైకి వచ్చి మైక్ ను ఇవ్వగా ఇంత అందాన్ని ఎలా మిస్ అయ్యానో అంటూ రొమాంటిక్ కామెంట్స్ చేసారు.
తాను ఒక రౌడీ,గుండా, అంటూ ఇంక తను ఒక రాస్కెల్ అంటూ ఓపెన్ అయ్యారు.దీంతో యాంకర్ శ్యామలతో సహా వేదిక మీద ఉన్న వారంతా కూడా తెగ నవ్వేశారు.
తరువాత బడవ రాస్కెల్ మూవీ గురించి చెబుతూ ఈ మూవీలో పుష్పాలో నెగిటివ్ రోల్ చేసినటువంటి ధనుంజయ్ హీరోగా ‘బడవ రాస్కెల్‘ మూవినీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.ఈనెల 18న సినిమా రిలీజ్ కానుందని తెలిపారు.ఈ సినిమా ఇదివరకే కన్నడలో మంచి సక్సెస్ ను అందుకొంది.ఇప్పుడు మళ్లీ తెలుగులో అదే పేరుతోనే రిలీజ్ చేయబోతున్నారు.కన్నడలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా తెలుగులో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాల్సి ఉంది.ఇక ఈ వేడుకలో భాగంగా వర్మ యాంకర్ శ్యామల పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.