ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, మూడు రాజధానులపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన విశాఖకు రాజధాని రావటం తథ్యం అని తేల్చిచెప్పేశారు.
విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుందని ఇందులో ఎటువంటి సందేహాలు అక్కర్లేదన్నారు.
‘మూడు రాజధానుల నిర్ణయం మా విధానం.ఎవరు ఎన్ని చెప్పినా రాష్ట్రంలో 3 రాజధానులు ఏర్పాటు చేస్తాం.3 రాజధానుల బిల్లులో లోపాలు సవరించి.కొత్త బిల్లుతో ముందుకొస్తాం.ప్రత్యేక హోదా విషయం విభజన చట్టంలో ఉంది.
పార్లమెంట్‌లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టంగా చెప్పారు.ఏపీకి ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.
ప్రత్యేక హోదాని సాధించేవరకు పోరాటం చేస్తాం.ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసిన ప్రతిసారి విభజన చట్టంలోని అంశాలపై అడుగుతున్నాం.
ప్రభుత్వ సాధన అనేది మా ప్రభుత్వ విధానం’ అని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు.