ఖిలాడి ప్రీ రిలీజ్ బిజినెస్‌ ఎంత.. వచ్చింది ఎంతో తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే

రవితేజ హీరోగా డింపుల్ హయాతి మరియు మీనాక్షి చౌదరీ లు హీరోయిన్స్ గా రమేష్ వర్మ దర్శకత్వం లో రూపొందిన చిత్రం ఖిలాడి తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సంక్రాంతి తర్వాత పెద్ద సినిమాలు లేకపోవడం తో ప్రేక్షకులు సినిమాల కోసం అల్లాడుతున్నారు.

 Raviteja Khiladi Movie Collections In Talk , Film News , Khiladi , Khiladi Col-TeluguStop.com

ఈ సమయంలో రవితేజ నటించిన సినిమా.అంతే కాకుండా మంచి బజ్ వచ్చిన నేపథ్యం లో కచ్చితంగా ఖిలాడి కి భారీ ఓపెనింగ్స్ ఉంటాయని ప్రతి ఒక్కరు భావించారు.

రవితేజ గత చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.దాంతో కిలాడి సినిమా కు ఏకంగా పాతిక కోట్ల ఫ్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.సినిమా మొత్తం 30 కోట్ల బడ్జెట్ తో రూపొందించినట్లుగా సమాచారం అందుతోంది.30 కోట్ల లో పాతిక కోట్ల రూపాయలు థియేట్రికల్ రైట్స్ ద్వారానే రాబట్టిన మేకర్స్‌ శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ ద్వారా మరో 15 కోట్ల వరకు రాబట్టినట్లు తెలుస్తోంది.

మొత్తానికి నిర్మాత ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తో లాభాలు దక్కించుకున్నాడు.కానీ సినిమా విడుదలైన మొదటి రోజే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.మొదటి రెండు షో లు పర్వాలేదు అన్నట్లుగా వసూళ్లు నమోదు అయినా తర్వాత నుండి వసూళ్లు డ్రాప్ అయ్యాయి.మొదటి రోజు నాలుగు కోట్ల వరకు వసూళ్లు దక్కించుకున్న ఈ సినిమా లాంగ్ రన్ లో మరో నాలుగు కోట్ల వసూళ్లు అయినా దక్కించుకుంటుందా అంటే కష్టమే అన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఉత్తరాదిన ఇతర రాష్ట్రాలు ఇలా మొత్తం అన్ని చోట్లా కలిపి ఈ సినిమా రంగం లో 10 కోట్ల వరకు రాబట్టే అవకాశాలున్నాయి.కేవలం తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ పాతిక కోట్ల కు అమ్ముడు పోగా వచ్చే మొత్తం వసూలు పది కోట్లు అంటే ఏ స్థాయిలో పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ సినిమా ను భారీ మొత్తాలకు బయ్యర్లు కొనుగోలు చేయడంతో బలి అవ్వడం ఖాయం అంటూ ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరో వైపు రవితేజ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రెడీ గా అవుతున్నాడు.

ఈ సమ్మర్ లోనే రామారావు ఆన్ డ్యూటీ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube