అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా "నైజం" షూటింగ్ ప్రారంభం

సోషల్ ఓరియంటెడ్ కుటుంబ కథా నేపథ్యంలో సమాజంలో జరుగుతున్నటువంటి వ్యక్తుల యొక్క నైజం వ్యక్తిత్వాలు, మనస్తత్వాలు, వ్యవహార శైలి వంటి అనేక కోణాలతో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న చిత్రం “నైజం’.ట్రూత్ అఫ్ లైఫ్ అనేది క్యాప్షన్.

 Glorious naijam Shooting Begins At Annapurna Studio , Annapurna Studio, Naijam,-TeluguStop.com

భార్గవి శ్రీ డైమెన్షన్ ఫిలిం పతాకంపై సంజయ్,రవి కిరణ్, సార నటీ,నటులుగా కోన రమేష్ దర్శకత్వంలో కాండ్రేగుల చందు, ఆంజనేయ ఎన్నంశెట్టి, లగుడు లోవ సత్య నారాయణ( బుజ్జి ) సంయుక్తంగా కలసి నిర్మిస్తున్నారు.ఈ చిత్రం పూజా కార్యక్రమాలు శనివారం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో లో ఘనంగా జరుపుకుంది.

పూజా కార్యక్రమాలు అనంతరం ముఖ్య అతిధులుగా వచ్చిన శ్రీ శ్రీ కళా వేదిక చైర్మన్ డాక్టర్ కత్తి మండ ప్రతాప్ హీరో, హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్ కొట్టి కెమెరా స్విచ్ఛాన్ చేయగా, చిత్ర దర్శకుడు కోనరమేష్ గౌరవ దర్శకత్వం వహించారు.అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర నిర్మాత కాండ్రేగుల చందు మాట్లాడుతూ.

దర్శకుడు రమేష్ చెప్పిన కథ నాకు చాలా బాగా నచ్చింది.కాన్సెంట్రేట్ గా వినడం జరిగింది.

ఒక మనిషి యొక్క యాట్యిట్యూడ్ ఏంటి, ఎప్పుడు ఎలా ప్రభావితం అవుతారు వంటి అనేక అంశాలను ఇందులో చాలా చక్కగా వివరించడం జరుగుతుంది.కథ నచ్చడంతో రామాంజనేయులు,సత్య నారాయణ గార్లతో కలిసి బడ్జెట్లో ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చాము.

హీరో హీరోయిన్లు పాత్రలు చాలా చక్కగా కుదిరాయి.కుటుంబ సమేతంగా చూడవలసిన ఈ సినిమాను ప్రతి ఒక్కరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

మరో నిర్మాతలు ఎన్నంశెట్టి ఆంజనేయులు, సత్యనారాయణ లు మాట్లాడుతూ.వ్యక్తుల యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది ఒక వ్యక్తి యొక్క నైజాన్ని ఏమి చూసి గుర్తిస్తారు అనేద కథాంశంతో భార్గవి శ్రీ డైమెన్షన్ ఫిలిం పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము.

సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేసి ఉగాది నాటికి ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల చేస్తాం.అందరూ మా సినిమాని ఆశీర్వదిస్తూ మీ అందరి సహకారాలు మాకు ఉండాలని కోరుతున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు కోన రమేష్ మాట్లాడుతూ.వ్యక్తుల యొక్క నైజం వ్యక్తిత్వాలు, మనస్తత్వాలు, వ్యవహారిక శైలి వంటి అనేక కోణాలతో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న చిత్రం “నైజం”.

తనికెళ్ళ భరణి గారి ఇన్స్పిరేషన్ తో ఈరోజు డైరెక్టర్ అవ్వడం జరిగింది మా నిర్మాతలు కాండ్రేగుల చందు, ఎన్నంశెట్టి ఆంజనేయులు, సత్యనారాయణ గార్లు వారి భుజాల మీద ఈ చిత్రాన్ని మోసుకొని నాకు ఈ సినిమాలో దర్శకత్వం చేసే అవకాశం ఇవ్వడం జరిగింది.వారికి నా ధన్యవాదాలు.

యూనిట్లో ప్రతి ఒక్కరూ నన్ను నాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు.ఈ చిత్రాన్ని హైదరాబాద్, మారేడు మిల్లి తదితర ప్రాంతాల్లో సింగిల్ షెడ్యూల్ లో ఈ సినిమాను కంప్లీట్ చేస్తాం.

మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించాలని అన్నారు.

మాటలు పాటల రచయిత డాక్టర్ కత్తిమండ ప్రతాప్ మాట్లాడుతూ.

డైరెక్టర్ మంచి టాలెంటెడ్ పర్సన్ మనిషి యొక్క నైజాన్ని ఈ చిత్రం ద్వారా ప్రత్యేకమైనటువంటి విభిన్నమైన శైలిలో చూపించడం జరుగుతుంది.అనేక మైనటువంటి కోణాల్లో గ్రామీణ ప్రాంత నేపథ్యంలో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేస్తారు.

ఈ సినిమాకు కుమార్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇస్తున్నారు.హీరో హీరోయిన్లు చక్కటి జోడీ కుదిరింది.సినిమా నిర్మాణంలో బడ్జెట్ కు వెనుకాడకుండా ముందుకు వచ్చి నిర్మిస్తున్న నిర్మాతలకు ఈ చిత్రం తప్పకుండా విజయవంత మవుతుందని ఆశిస్తున్నాను.

సంగీత దర్శకుడు మోహన్ కుమార్ మాట్లాడుతూ.

దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యాను బ్యాగ్రౌండ్ స్కోరు పాటలకు మంచి స్కోప్ ఉన్న సినిమా ఇది.అందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.చిత్ర హీరో సంజయ్ మాట్లాడుతూ.కథ చాలా బాగుంది.మంచి సోసియల్ మెసేజ్ ఉన్న నైజం చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.హీరోయిన్ సార మాట్లాడుతూ .నా మీద ఇంత ఎక్స్పెక్టేషన్ ఉంచుకొని ఈ సినిమాలో నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు ధన్యవాదాలు.ఇలాంటి మంచి సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు ఈ సినిమా ఆ గొప్ప సక్సెస్ కావాలని మనస్పూర్తిగా కోరుతున్నాను

.

Glorious "Naijam" Shooting Begins At Annapurna Studio , Annapurna Studio, Naijam, Dr. Kattimanda Pratap, Mohan Kumar, Sanjay, Ravi Kiran - Telugu Drkattimanda, Naijamannapurna, Mohan Kumar, Naijam, Ravi Kiran, Sanjay

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube