కాలేజీల మూసివేత.. న్యాయం చేయండి, పంజాబ్‌‌లోని కెనడా కాన్సులేట్ వద్ద విద్యార్ధుల ఆందోళన

కెనడాలోని మూడు కాలేజీలు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మూసివేయడంతో దాదాపు 2000 మంది భారతీయ విద్యార్ధులు రోడ్డునపడ్డ సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో విద్యార్ధులకు న్యాయం చేయాలంటూ ఇండియన్ మాంట్రియల్ యూత్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ సభ్యులు గురువారం ఛండీగడ్‌లోని కెనడా కాన్సులేట్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.

 Students Protest Outside Canadian Consulate, Demand Refund , Indian Montreal You-TeluguStop.com

కాలేజీల నుంచి విద్యార్ధులు కట్టిన డబ్బు వాపసు ఇప్పించాలని విద్యార్ధి నేతలు డిమాండ్ చేస్తున్నారు.దీనిపై స్పందించిన కాన్సులేట్ అధికారులు.

వారం రోజుల్లో పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.ఇది అమల్లోకి రానిపక్షంలో ఫిబ్రవరి 23న లూథియానాలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని విద్యార్ధులు హెచ్చరించారు.

ఈ సందర్భంగా హుసన్ బావా అనే విద్యార్ధి మీడియాతో మాట్లాడుతూ.ఈ కాలేజీల స్థితి గురించి తెలుసుకున్న వెంటనే, తాము ఫీజు వాపసు చేయాల్సిందిగా కోరామని చెప్పారు.

నిబంధనల ప్రకారం.వాపసు ప్రక్రియను 45 రోజులలోపు ప్రారంభించాలి.

ఈ కాలేజీలు తమను ఇంతకాలం చీకటిలో వుంచాయని హుసన్ ఆవేదన వ్యక్తం చేశారు.అంతర్జాతీయ విద్యార్ధులు తమ స్టడీ పర్మిట్ కోసం పొందాల్సిన క్యూబెక్ యాక్సెప్టెన్స్ సర్టిఫికేట్స్ (సీఈక్యూ) ప్రాసెసింగ్‌ జరుగుతున్న కారణంగా వాపసు ప్రక్రియ నిలిచిపోయింది.విద్యార్ధులు తమ అడ్మిషన్లు, ఇతర అనుమతుల కోసం దాదాపు రూ.10 లక్షలకుపైగా చెల్లించారు.వీటిని తిరిగి చెల్లించాలనే విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు.

కాగా.

కెనడాలోని మాంట్రియల్‌లో వున్న Collège de comptabilité et de secretariat du Québec (CCSQ), College de I’Estrie (CDE), M కాలేజ్‌లు కోవిడ్ కారణంగా తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.దీంతో క్రెడిట్ ప్రోటెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి.

ఈ క్రమంలోనే జనవరి 10న ఆకస్మాత్తుగా కాలేజీలు మూతపడ్డాయి.CCSQ కాలేజీ.

అకౌంటింగ్, సెక్రటేరియల్ స్టడీస్, మెడికల్, కంప్యూటింగ్, లీగల్ స్టడీస్‌లో వృత్తిపరమైన శిక్షణను అందిస్తోంది.CDE కాలేజీ.

బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కోర్సులను అందిస్తోంది.M కాలేజీలో వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికతలో నాలుగు కోర్సులు అందజేస్తోంది.1,173 మంది భారత విద్యార్ధులు కెనడాలో వ్యక్తిగతంగా చదువుతుండగా.637 మంది విద్యార్ధులు కోవిడ్ కారణంగా భారత్‌లో ఇంటి నుంచి ఆన్‌లైన్ తరగతుల ద్వారా చదువుతున్నట్లు ది వైర్ నివేదించింది.

Students Protest Outside Canadian Consulate, Demand Refund , Indian Montreal Youth Students Organization, Ludhiana, Chandigarh, Consulate Of Canada, Hussain Bawa, Quebec Acceptance Certificates, College De I'Estrie , Collège De Comptabilité Et De Secretariat Du Québec - Telugu Chandigarh, Collgede, De Iestrie, Demand Refund, Hussain Bawa, Indian Montreal, Ludhiana

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube