కాలేజీల మూసివేత.. న్యాయం చేయండి, పంజాబ్‌లోని కెనడా కాన్సులేట్ వద్ద విద్యార్ధుల ఆందోళన
TeluguStop.com
కెనడాలోని మూడు కాలేజీలు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మూసివేయడంతో దాదాపు 2000 మంది భారతీయ విద్యార్ధులు రోడ్డునపడ్డ సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో విద్యార్ధులకు న్యాయం చేయాలంటూ ఇండియన్ మాంట్రియల్ యూత్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ సభ్యులు గురువారం ఛండీగడ్‌లోని కెనడా కాన్సులేట్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.
కాలేజీల నుంచి విద్యార్ధులు కట్టిన డబ్బు వాపసు ఇప్పించాలని విద్యార్ధి నేతలు డిమాండ్ చేస్తున్నారు.
దీనిపై స్పందించిన కాన్సులేట్ అధికారులు.వారం రోజుల్లో పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.
ఇది అమల్లోకి రానిపక్షంలో ఫిబ్రవరి 23న లూథియానాలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని విద్యార్ధులు హెచ్చరించారు.
ఈ సందర్భంగా హుసన్ బావా అనే విద్యార్ధి మీడియాతో మాట్లాడుతూ.ఈ కాలేజీల స్థితి గురించి తెలుసుకున్న వెంటనే, తాము ఫీజు వాపసు చేయాల్సిందిగా కోరామని చెప్పారు.
నిబంధనల ప్రకారం.వాపసు ప్రక్రియను 45 రోజులలోపు ప్రారంభించాలి.
ఈ కాలేజీలు తమను ఇంతకాలం చీకటిలో వుంచాయని హుసన్ ఆవేదన వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ విద్యార్ధులు తమ స్టడీ పర్మిట్ కోసం పొందాల్సిన క్యూబెక్ యాక్సెప్టెన్స్ సర్టిఫికేట్స్ (సీఈక్యూ) ప్రాసెసింగ్ జరుగుతున్న కారణంగా వాపసు ప్రక్రియ నిలిచిపోయింది.
విద్యార్ధులు తమ అడ్మిషన్లు, ఇతర అనుమతుల కోసం దాదాపు రూ.10 లక్షలకుపైగా చెల్లించారు.
వీటిని తిరిగి చెల్లించాలనే విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు.కాగా.
కెనడాలోని మాంట్రియల్‌లో వున్న Collège De Comptabilité Et De Secretariat Du Québec (CCSQ), College De I'Estrie (CDE), M కాలేజ్‌లు కోవిడ్ కారణంగా తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.
దీంతో క్రెడిట్ ప్రోటెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి.ఈ క్రమంలోనే జనవరి 10న ఆకస్మాత్తుగా కాలేజీలు మూతపడ్డాయి.