సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ప్రపంచాన్ని మరింత దగ్గర చేస్తోంది.అదే విధంగా పాత విషయాలను కూడా గుర్తు చేసుకోవడానికి సోషల్ మీడియా బాగా ఉపయోగపడుతోంది.
అయితే ఇదే విషయాన్ని వారికి అనుగుణంగా మార్చుకున్న కొందరు ఆకతాయిలు గతంలో జరిగిన పొరపాట్లను తెర పైకి తీసుకు వస్తూ వాటిని మరింత పెద్దదిగా చేసి చూపిస్తున్నారు.కొంతమంది వారి తప్పులు లేకపోయినా కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తోంది.
తాజాగా ఒక అమ్మాయి కూడా ఇదే విధంగా వివాదంలో ఇరుక్కుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు అమ్మాయి క్యూట్, అబ్బాయి నాటు, సూర్య లాంటి వెబ్ సిరీస్ ల ద్వారా ఫేమస్ అయిన మౌనిక రెడ్డి.
సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే వారికి మౌనికా రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె పలు వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
యూత్ లో మౌనిక రెడ్డి కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇక షణ్ముఖ్ జశ్వంత్ తో కలసి నటించిన సూర్య వెబ్ సిరీస్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది.
అయితే మౌనికా కి సంబంధించిన 2015 నాటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది.ఆ వీడియోలో ఆమె రాజకీయ ప్రకటన చేయడం కనిపించింది.
అయితే అప్పట్లో అలా పబ్లిక్ గా మాట్లాడితే వచ్చే సమస్యల గురించి ఎటువంటి అవగాహన లేకుండా చేసిన స్టేట్మెంట్ అది.ఒక సున్నితమైన సమస్యకు యూత్ కి చెందిన రెస్పాన్స్ గానే తీసుకోవాలి.
గత వీడియో వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలు అయినా దెబ్బతిని ఉంటే, వారి మనసును ఉంచుకొని ఉంటే నేను క్షమాపణ కోరుతున్నాను అంటూ క్షమాపణలు తెలిపింది మౌనికా రెడ్డి.నేను ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తూ ఉంటాను.పవన్ కళ్యాణ్ గారిని లేదా పవన్ కళ్యాణ్ గారి పార్టీని ఏ విధంగా ప్రస్తావించినప్పటికీ నేను పైన పేర్కొన్న స్టేట్మెంట్ ని పవన్ కళ్యాణ్ గారి కి లింక్ చేస్తూ అనేక పోస్టులను చూశాను.అది నిజం కాదు.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి తో నేను భీమ్లా నాయక్ సినిమాలో పని చేస్తున్నా ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో నాకు తెలిసింది అని చెప్పు కొచ్చింది మౌనికా రెడ్డి.