పుష్ప సీన్ కాపీనా.. వేణు మాధవ్ ఐదేళ్ల క్రితమే ఆ మాట అన్నారా?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం పుష్ప.ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 Pushpa Scean Coped Did Venu Madhav Say That Five Years Ago, Venu Madhav, Tollywo-TeluguStop.com

ఈ సినిమా అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది.ఈ సినిమాతో అల్లు అర్జున్ కి పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు దక్కింది.

ఇక ఈ సినిమాలోని పాటలు డైలాగులు అయితే సోషల్ మీడియాలో రికార్డులను సృష్టించాయి.ఇది ఇలా ఉంటే పుష్ప సినిమాలోని ఒక ఇన్సిడెంట్ గతంలో కమెడియన్ వేణుమాధవ్ చేసిన దానిని కాపీ కొట్టారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే.

ఈ సినిమాలో అల్లుఅర్జున్ ఓనర్ ఎదురుగా వస్తున్నప్పుడు కాలు మీద కాలు వేసుకుని ఉన్నప్పుడు అలా ఎందుకు వేసుకున్నావు అని ఒక వ్యక్తి అడిగినప్పుడు నా కాలు మీద నా కాలు వేసుకుంటే తప్పు ఏమిటి అని చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్ అయ్యింది.

ఈ సన్నివేశం పై దర్శకుడు సుకుమార్ స్పందిస్తూ తన సోదరుడు కూడా ఒకసారి ఇదే తరహాలో ప్రవర్తించాడని అందుకే ఇది సినిమాలో పెట్టడం జరిగింది అన్నట్టుగా తెలిపాడు.సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం.

ఇదే డైలాగ్ ను కమెడియన్ వేణుమాధవ్ ఐదేళ్ల కిందటే చెప్పాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.ఒక ఇంటర్వ్యూలో వేణుమాధవ్ ఈ రోజు స్టార్ హీరో తో ఎదురైన అనుభవం గురించి తెలిపాడు.

అందులో ఏమయ్యా నువ్వు ఎవరు వచ్చినా కూడా కాలు మీద కాలు వేసుకుని ఉంటావ్ అంట కదా అని అడగగా.

Telugu Comedia, Pushpa, Tollywood, Venu Madhav-Movie

అప్పుడు మీకు ఏ నా కొడుకు చెప్పారు అని వేణుమాధవ్ ప్రశ్నించాడట.అప్పుడు వెంటనే సదరు హీరో ఫోన్ తీసి ఒకరికి ఫోన్ చేసి.అప్పుడు వేణుమాధవ్ మీతో ఏం చెప్పాడో కరెక్ట్ గా చెప్పండి అని అడిగినప్పుడు.

కాలు మీద కాలు వేసుకుంటావ్ అని తనతో అన్నారు అని సదరు హీరో ఆన్సర్ ఇచ్చాడట.అప్పుడు వేణుమాధవ్ నా కాలు మీద కాలు వేసుకుంటే తప్పేంటి అని సమాధానం ఇవ్వడంతో సదరు హీరో సైలెంట్ గా ఫోన్ లో ఉండిపోయాడట.

ఇక అదే తరహాలో పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తో చెప్పించడం వైరల్ గా మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube