ఫిన్‌టెక్ స్టార్టప్ ‘‘బోల్ట్’’ కొత్త సారథిగా ఇండో అమెరికన్.. ఎవరీ మజు కురువిల్ల..!

ఇప్పటికే అమెరికన్ టెక్ దిగ్గజ సంస్థలకు పలువురు భారతీయులు నాయకత్వం వహిస్తున్నారు.సత్యనాదెళ్ల, సుందర్ పిచాయి, అరవింద్ కృష్ణ, ఇంద్రా నూయి, అజయ్ బంగా వంటివారు విజయవంతంగా కంపెనీలను నడిపిస్తున్నారు.

 Indian-origin Executive Maju Kuruvilla Is The New Ceo Of Fintech Startup Bolt ,-TeluguStop.com

గతేడాది నవంబర్‌లో భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్‌.సోషల్ మీడియా దగ్గజం ట్విట్టర్‌కు సీఈవోగా నియమితులవ్వడంతో కార్పోరేట్ ప్రపంచంలో భారతీయుల ఆధిపత్యం మరోసారి చర్చకు వచ్చింది.

తాజాగా శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఫిన్‌టెక్ స్టార్టప్ ‘‘బోల్ట్’’ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఇండో అమెరికన్ ఎగ్జిక్యూటివ్ మజు కురువిల్ల నియమితులయ్యారు.అలాగే బోల్ట్ వ్యవస్థాపకుడు ర్యాన్ బ్రెస్లో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొత్త బాధ్యతలు చేపట్టారు.

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో దాదాపు 8 ఏళ్ల పాటు పనిచేసిన మజు కురువిల్ల గతేడాది జనవరిలో బోల్ట్‌లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా విధుల్లో చేరారు.అనంతరం ఆగస్టులో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు.

కర్ణాటక రాష్ట్రం మంగళూరు యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో కురువిల్ల గ్రాడ్యుయేషన్ చేశారు.అనంతరం వాషింగ్టన్ వర్సిటీ నుంచి ఎంబీఏ డిగ్రీ అందుకున్నారు.

బోల్ట్ సీఈవోగా కురువిల్లను నియమిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు బ్రెస్లో ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు.ఆయన ఇప్పటికే తన సమర్థత ద్వారా బోల్ట్ ప్రస్థానాన్ని పూర్తిగా మార్చేశారని ప్రశంసించారు.తాను ఇకపై ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా మరిన్ని ఒప్పందాలు, కొనుగోళ్లు, నిధుల సేకరణ, వర్క్ కల్చర్‌పై దృష్టి సారిస్తానని బ్రెస్లో ట్వీట్‌లో తెలిపారు.మరోవైపు బ్రెస్లో రాజీనామా చేసినట్లుగా వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.

తాను బోల్ట్‌ని వదిలి ఎక్కడికి వెళ్లబోనని స్పష్టం చేశారు.

టెక్ క్రంచ్ అంచనా ప్రకారం.

బోల్ట్ ప్రస్తుతం నిధులు సేకరించే పనిలో వుంది.ప్రస్తుతం ఈ కంపెనీ విలువ 14 బిలియన్ డాలర్లు వుంటుందని టెక్ క్రంచ్ తెలిపింది.

ఈ ఏడాది జనవరి నుంచి వారానికి నాలుగు రోజులే పనిచేసే కల్చర్‌ను బోల్ట్ ప్రవేశపెట్టి సంచలనం సృష్టించింది.

Indian-origin Executive Maju Kuruvilla Is The New CEO Of Fintech Startup Bolt , American Tech Giant, Parag Agarwal, San Francisco, Fintech Startup, Bolt, Indo-American Executive Maju Kuruvilla, Ryan Breslow, Tech Crunch - Telugu Americantech, Bolt, Fintech Startup, Indianorigin, Indoamerican, Parag Agarwal, Ryan Breslow, San Francisco, Tech Crunch

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube