రంగులు మార్చే పక్షిని ఎప్పుడైనా చూసారా? సంతానోత్పత్తి స‌మ‌యంలో ఏం చేస్తుందంటే..

మీరు రంగులు మార్చే పక్షులను చూశారా? దీనిని క్యాటిల్ ఎగ్రెట్ లేదా బుబుల్కస్ ఐబిస్ అని కూడా అంటారు.మనం రైలులో లేదా జాతీయ రహదారి గుండా వెళ్ళినప్పుడల్లా పొలాలు మరియు కొట్టాల మధ్య ఈ పక్షులను చూడవచ్చు.

 Have You Ever Seen A Color Changing Bird Former Paddy Friendly Water, Color Cha-TeluguStop.com

బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలో ఈ కొంగలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఈ కొంగలు పశువుల వీపుపై కూర్చున్న స్థితిలో క‌నిపిస్తుంటాయి.

పొలాల్లో దున్నేటప్పుడు ఈ కొంగలు ట్రాక్టర్‌ను వెంబడిస్తాయి.

ఇవి పురుగులను తిని పంటలను కాపాడుతుంటాయి.

రైతులకు స్నేహితుల‌ని అభివ‌ర్ణించే ఈ తెల్ల కొంగల‌లో నాలుగు జాతులు ఉన్నాయి.అవి లిటిల్ ఎగ్రెట్, క్యాటిల్ ఎగ్రెట్, ఇంటర్మీడియట్ ఎగ్రెట్ మరియు గ్రేట్ ఎగ్రెట్.

అన్ని కొంగలు తెల్లటి రంగులో ఉన్నప్పటికీ.ఆడ కొంగ‌లు సంతానోత్పత్తి కాలంలో పసుపు, బాదం, నారింజ రంగులలోకి మారుతాయి.

సంతానోత్పత్తి కాలం చివరిలో అవి మళ్లీ మిల్కీ వైట్‌గా మారుతాయి.ఈ కొంగలను సామాజిక పక్షులు అని పిలుస్తారు.

ఇవి గుంపులుగా ఉండేందుకు ఇష్టపడతాయి.కాకుల మాదిరిగా ఇవి గూళ్లు కట్టుకుని, వాటిలో నీలిరంగు గుడ్లను 3 నుంచి 5 వరకు పెడతాయి.

ఈ గూళ్లు పొలాల‌లో క‌నిపిస్తుంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube