ఈ డేట్ కి ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చేదే లే.. ఆ హీరో వల్లనే అట..

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమాను టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కించాడు.

 Rajamouli Rrr Movie Release On April 28 Due To Puneeth Rajkumar James Release Ef-TeluguStop.com

ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు.పీరియాడిక్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 7న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భారీ ప్లాన్ లు వేశారు.

ఇందుకు తగ్గట్టుగానే ఎప్పటి నుండో ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేసారు.

కానీ పెరుగుతున్న ఓమిక్రాన్ నేపథ్యంలో అనూహ్యంగా ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

థియేటర్స్ లో 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉండడంతో ఈ సినిమా వాయిదా వేయక తప్పలేదు.దీంతో ప్రేక్షకులు అందరు నిరాశ వ్యక్తం చేసారు.అయితే ఆ తర్వాత మేకర్స్ మరొక కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు.అయితే ఈసారి మాత్రం రెండు రిలీజ్ డేట్ లు ప్రకటించారు.

కరోనా మహమ్మారి తగ్గి 100 శాతం ఆక్యుపెన్సీ ఉంటే మార్చి 18న విడుదల చేస్తామని లేకపోతే ఈ సినిమాను ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సినిమా మార్చి 18న రిలీజ్ అయ్యేందుకు అవకాశాలు లేవన్నట్టు తెలుస్తుంది.

ఎందుకంటే స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ నటించిన జేమ్స్ సినిమా మార్చి 17న రిలీజ్ చేయబోతున్నారు.

రిపబ్లిక్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు.కర్ణాటక డిస్ట్రిబ్యూటర్స్ అందరు ఈ సినిమా తప్ప మరొక సినిమాను ఆ వారం పాటు విడుదల చేయకూడదని తీర్మానించడంతో ఇక ఆర్ ఆర్ ఆర్ అక్కడ రిలీజ్ అవ్వడం అసాధ్యం.అందుకే ఆర్ ఆర్ ఆర్ మిగిలిన డేట్ ఏప్రిల్ 28నే రిలీజ్ కావాల్సి ఉంది.

మేకర్స్ ప్రకటించిన ఒక రిలీజ్ డేట్ ఇప్పటికే పోయింది.ఇక మిగిలింది ఒక్క రిలీజ్ డేట్ మాత్రమే.

మరి ఈ రిలీజ్ డేట్ కి అయినా ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube