ఎడారి అనగానే మన మనసులోకి ఒక ఊహ వస్తుంది.అక్కడంతా ఎండ ఎక్కువగా ఉంటుందని అందరూ అనుకుంటారు.
ఎండకు తగిన విధంగానే అక్కడి పరిస్థితులు కూడా ఉంటాయని చర్చించుకుంటారు.మనకు ఇప్పటి వరకు అనేక సినిమాల్లో కూడా ఎడారి అంటే అలాగే ఉంటుందని చూపించారు.
అక్కడ ఒక్క చుక్క కూడా తాగేందుకు నీరు దొరకదని ఎటు చూసినా వందల కిలో మీటర్ల మేర ఇసుక దిబ్బలే కనిపిస్తాయని అంటారు.అటువంటిది ఎడారిలో ఓ చోట మంచు కురిసింది.
ఈ వార్తను నమ్మేందుకు మీకు కాస్త సందేహంగా ఉన్నా ఇది పచ్చి నిజం.ఎడారిలో మంచు కురిసింది.
ఆ ఊహే చాలా కొత్తగా ఉంది కదూ.ఇంకా అక్కడ మంచు కురిసినపుడు తీసిన వీడియో చాలా కొత్తగా ఉంటుంది.ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారిగా పేరు గాంచిన సహారా ఎడారి. అక్కడ మంచు కురిసిన విధానాన్ని అక్కడి ఫ్రకృతి ఫొటోలను ఫొటోగ్రాఫర్ కరీమ్ తన కెమెరాలో బంధించారు.
ఈ ఫొటోలను చూసి ఒకొక్కోరు తెగ మురిసిపోతున్నారు.ఇక ఇందుకు సంబంధించిన వీడియోను చూసిన వారైతే ఒక రేంజ్ లో ఆశ్చర్యపడుతున్నారు.
సహారా ఎడారి అంటే ప్రపంచంలో ఉన్న ఎడారుల్లో కెల్లా అతి పెద్దదనే పేరు ఉంది.ఈ ఎడారిని ఎటు నుంచి చూసినా కానీ చుట్టూ ఇసుకే తప్ప మరేమీ కనిపించదు.
సాధారణ భూమి మీద పెరిగినట్లు ఎడారిలో మొక్కలు కూడా పెరగవు.కానీ ఇప్పుడు సహారా ఎడారికి సంబంధించిన ఓ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అదేంటంటే పెద్దదైన సహారా ఎడారిలో మంచు కురుస్తోందట.అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లోకి చేరుకున్నాయని అక్కడి వారు చెబుతున్నారు.ఇలా ఎడారిలో మంచు కరిసిన పరిస్థితులను ఫేమస్ ఫొటోగ్రాఫర్ కరీమ్ తన కెమెరాలో బంధించాడు.ఇందుకు సంబంధించిన వీడియోను మీరు కూడా వెంటనే చూసేయండి.ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.