మనిషికి నిద్ర అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైనది.నిద్రలో కలలు రావడమనేది మరింత సహజం.
అందుకే నిద్ర, కలలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మనం సగటున 25 ఏళ్లు నిద్రపోతాం.
అంధులు ధ్వని గురించి కలలు కంటారు.స్లీప్‌వాకర్‌ని నిద్ర లేపడం వల్ల వారికి గుండెపోటు లేదా కోమా కూడా వస్తుందని మనలో చాలా మంది నమ్ముతారు.
ఆహార డిప్రెషన్ కంటే నిద్రలేమి ప్రమాదకరం.నిద్ర లేకుండా అత్యధికంగా నమోదు చేయబడిన కాలం 11 రోజులు.
ఎక్కువ రోజులు నిద్ర లేకుండా ఉండటం చాలా ప్రమాదకరం.ఇది బరువు పెరగడానికి, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థకు, చివరకు మరణానికి కూడా కారణమవుతుంది.
కలర్ టెలివిజన్ రాకముందు 15% కలలు మాత్రమే రంగులలో ఉండేవి.నేడు మనం 75% రంగుల కలలు కంటున్నాం.
పిల్లులు తమ జీవితంలో మూడింట రెండు వంతుల నిద్రలోనే గడుపుతారు .మనకు మూడు, నాలుగు సంవత్సరాల వయస్సు వచ్చే వరకు మనం మన కలలో కనిపించం.స్త్రీల కంటే పురుషులు ఎక్కువ హింసాత్మక దూకుడుతనం కలిగిన కలలు కంటారు.మీరు ఆలోచించే వాటి గురించి మాత్రమే మీరు కలలు కంటారు.బరువు తగ్గడానికి నిద్ర సహాయపడుతుంది.మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే, రోజుకు 7 నుండి 9 గంటల పాటు నిద్రపోతూ, పోషక ఆహారం తీసుకుంటూ, శారీరక వ్యాయామం చేయాలి.