కోవాక్సిన్ టీకాపై పోస్టల్ స్టాంపు విడుదల చేసిన కేంద్రం..!

దేశంలోని ప్రజలందరిని కరోనా వైరస్ ముప్పతిప్పలు పెట్టింది.ఈ మహమ్మారి వైరస్ వలన ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.

 Center Issues Postage Stamp On Covaxin Vaccine Covid Vaccination, Done, Postal S-TeluguStop.com

మారేందరో నిస్సహాయులయిపోయారు.కరోనాని కట్టడి చేసే క్రమంలో మన దేశం వాక్సిన్ ను కనిపెట్టి, పంపిణీని ప్రారంభించి ఇప్పటికి ఒక సంవత్సరమైంది.

ఈ సందర్భంగా కరోనా నియంత్రణకు భారత్ బయోటెక్, భారత వైద్య పరిశోధన మండలి సంయుక్తంగా కనిపెట్టిన కొవాగ్జిన్ టీకాపై కేంద్ర ప్రభుత్వం పోస్టల్ స్టాంపును ప్రవేశపెట్టింది.

కరోనా నియంత్రణ కోసం భారతదేశంలోకి అందుబాటులోకి తీసుకొచ్చిన కోవ్యాక్సిన్ ఇప్పటికే 70% మందికి వేయడం పూర్తయింది.

భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా ఎంతో మెరుగైన ఫలితాలనిచ్చింది అనే చెప్పాలి.ఈ క్రమంలో వాక్సిన్ ప్రక్రియ ప్రారంభం అయ్యి ఏడాది అవ్వడంతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదివారం అంటే జనవరి 16 న కోవాగ్జిన్ టీకాపై పోస్టల్ స్టాంపును విడుదల చేయడంతో పాటు ఈ విధంగా స్పందించారు.

భారత దేశంలో కరోనా టీకా పంపిణీ ఒక యజ్ఞంలా జరిగిందని ఆ యజ్ఞాన్ని చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయిందని అన్నారు.

Telugu Central, Covid, Pm Modi, Stamp-Latest News - Telugu

అంతేకాకుండా మన ప్రధాని నరేంద్రమోదీ కలలుకన్న ‘స్వావలంబన భారత్‘ సాధనలో కొవాగ్జిన్ టీకా తయారీ ఓ కీలక పరిణామం అని చెప్పుకొచ్చారు.భారత్ సాధించిన ఘనతలో ఇది కూడా ఒకటి అని తెలిపారు.ఎంతో జనాభా కలిగిన భారత్ లో వ్యాక్సిన్ రూపంలో కరోనాను కట్టడి చేయటం అంటే మాములు విషయం కాదని, ఈ విషయంపై ప్రపంచ దేశాలు కూడా ఆశ్చర్యపోయాయని తెలిపారు.

అలాగే వాక్సిన్ కనిపెట్టే క్రమంలో కృషి చేసిన శాస్త్రవెత్తలకు, కరోనా సమయంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలను కాపాడిన వైద్య సిబ్బంది అందరికి నా ధన్యవాదాలు అని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలియచేసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube