ఇదేదో భలే ఉందే... క్యూ లైన్లో నుంచుంటే రోజుకి 16 వేల రూపాయలా..?!

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ అతలాకుతలం చేసిన విషయం అందరికి తెలిసిందే.కరోనా వైరస్ వలన ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారు.

ఆర్ధికంగా కూడా చాలామంది కృంగిపోయారు.కొంతమంది అయితే ఉద్యోగాలను సైతం కోల్పోయి రోడ్డున పడ్డారు.

తినడానికి తిండి లేక ఏ పని దొరికినా చాలు అనుకుని పనికోసం నానా తంటాలు పడ్డారు.ఈ క్రమంలోనే బ్రిటన్ కు చెందిన ఫ్రెడ్డీ బెక్కెట్ అనే వ్యక్తి అందరికంటే కాస్త భిన్నంగా అలోచించి వెరైటీగా పనిచేస్తూ రోజుకు వేల రూపాయిలు సంపాదిస్తున్నాడు.

కరోనా కాలంలో అడుగు బయట పెట్టాలంటే చాలు వణికిపోతున్నారు.ముఖ్యమగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో అయితే కరోనా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

Advertisement

అందుకే చాలా మంది గంటలకొద్ది క్యూ లైన్లో నుంచోడానికి బయపడతున్నారు.అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకుని రోజుకు వేలల్లో సంపాదిస్తున్నాడు బెక్కెట్ అనే వ్యక్తి అదెలా అంటారా.

నిత్యం రద్దీగా ఉండే దగ్గర రోజుకు గంటల కొద్ది క్యూలైన్లో నిలబడి తన వంతు వచ్చాక కావాల్సివ వస్తువులను కొనుక్కుని వాటిని తీసుకుని వెళితే చాలు అతనికి డబ్బులు వస్తాయట.కావలిసిన వస్తువులు కొనుక్కుంటే డబ్బులు ఎలా వస్తాయి.ఎవరు ఇస్తారు అని ఆలోచిస్తున్నారా.

బెక్కెట్ అలా కొనుగోలు చేసిన వస్తువులన్ని తనకు సంబందించిన వస్తువులు కాదు.

అతనికి ఎవరైతే కొనుగోలు చేయమన్నారో వారి కోసం గంటల కొద్ది క్యూ లైన్లో నుంచుని వారు చెప్పిన వస్తువులను కొనుగోలు చేసి వారికి అందిస్తాడన్నమాట.అలా వారు చెప్పిన వస్తువులను వారి అందించి అందుకు ప్రతిఫలంగా వారు అతనికి రూ.16 వేల వరకు ఇచ్చేవారట.అలా బెక్కెట్ ధనవంతులైన వారిని ఎన్నుకుని వారి అవసరాలకు తగ్గట్టుగా ఈ సేవలు చేస్తు వారి దగ్గర నుండి డబ్బులు సంపాదిస్తున్నట్టు ఫ్రెడ్డీ బెక్కెట్ తెలిపాడు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఎందుకంటే ధనవంతులు ఎక్కువ సేపు అలా గంటల తరబడి క్యూలైన్లో నిలబడలేరు.అలాగే లైన్లో నుంచునే సమయం కూడా వాళ్లకు ఉండదు.అలాంటి వారి కోసమే తాను ఈ సేవను ఎంచుకున్నానని, ఫలితంగా రోజుకు కొంత డబ్బులను కూడా సంపాదించుకుంటున్నాను అని ఫ్రెడ్డీ తెలియజేశాడు.

Advertisement

తాజా వార్తలు