ఇంట్లో కరెంట్ ఉండేది కాదు.. అలాంటి కష్టాలు అనుభవించా.. చమ్మక్ చంద్ర షాకింగ్ కామెంట్స్!

బుల్లితెరపై కామెడీ షోల ద్వారా, సినిమాల ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వాళ్లలో చమ్మక్ చంద్ర ఒకరు.జబర్దస్త్, అదిరింది షోలలో ఈ కమెడియన్ రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్నారనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపించాయి.

 Comedian Chammak Chandra Shocking Comments About His Career Troubles , Career Tr-TeluguStop.com

అయితే కొన్ని కారణాల వల్ల చమ్మక్ చంద్ర జబర్దస్త్ షోను వీడి అదిరింది షోలో చేరగా జబర్దస్త్ షో కాన్సెప్ట్ తో ప్రసారమైన అదిరింది షో ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.

అయితే సినిమాలలో మాత్రం చమ్మక్ చంద్రకు బాగానే ఆఫర్లు దక్కుతున్నాయి.

తాజాగా విడుదలైన బంగార్రాజు సినిమాలో కూడా చమ్మక్ చంద్ర చిన్న పాత్రలో కనిపించారు.అఖండ సినిమాలోని చమ్మక్ చంద్ర రోల్ కు మంచి గుర్తింపు దక్కింది.

ఒక ఇంటర్వ్యూలో చమ్మక్ చంద్ర మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి కామెడీ అంటే ఇష్టమని పోస్టర్లపై కమెడియన్ల ఫోటోలు కనిపిస్తే ఆ సినిమాను కచ్చితంగా చూసేవాడినని చమ్మక్ చంద్ర అన్నారు.

బాల్యంలో పడిన కష్టాలతో పోలిస్తే కెరీర్ తొలినాళ్లలో ఎదురైన కష్టాలు ఎక్కువైనా డేర్ చేసి ఆ కష్టాలను ఎదుర్కొన్నానని చమ్మక్ చంద్ర చెప్పుకొచ్చారు.

ఇండస్ట్రీకి సాధించడానికి తాను వచ్చానని ఎంజాయ్ చేయాలని కాదని చమ్మక్ చంద్ర తెలిపారు.బాల్యంలో ఇంట్లో కరెంట్ ఉండేది కాదని ఇంట్లో కరెంట్ దీపం మాత్రమే ఉండేదని చమ్మక్ చంద్ర తను అనుభవించిన కష్టాలను చెప్పుకొచ్చారు.

Telugu Career Troubles, Chammak Chandra, Jabardast Show-Movie

నాన్న ఎంతో కష్టపడి మమ్మల్ని పోషించారని చమ్మక్ చంద్ర వెల్లడించారు.బాల్యంలో అందరూ అన్నం తింటుంటే తాను మొక్కజొన్న రొట్టెలు తినేవాడినని చమ్మక్ చంద్ర అన్నారు.అలాంటి కష్టాలను అనుభవించిన చమ్మక్ చంద్ర సినిమాలు, టీవీ షోల వల్ల ఆర్థికంగా స్థిరపడ్డారు.చమ్మక్ చంద్ర నటించిన సినిమాలు సక్సెస్ సాధిస్తుండటంతో ఈ కమెడియన్ కు ఆఫర్లు పెరుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube