కరోనా దెబ్బకి సినీ ఇండస్ట్రీ ఎంత అతలాకుతలమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.థియేటర్లో మూత పడి షూటింగ్ లు ఆగిపోయి ఒక రకంగా సినిమా పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది.
కరోనా వైరస్ ప్రభావం తగ్గడంతో మళ్లీ షూటింగ్ లు ప్రారంభమవుతున్నాయని అనుకుంటున్న సమయంలో రెండోదశ దూసుకువచ్చింది.రెండో దశ ప్రభావం కూడా తగ్గి పరిస్థితులు అనుకూలిస్తున్నాయ్ అనుకుంటున్న సమయంలో మళ్లీ కేసులు పెరుగుతుండటంతో సినిమా షూటింగులు మరోసారి ఆగిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఎంతో మంది సినీ సెలబ్రిటీలు వరుసగా వైరస్ బారిన పడుతూ ఉండటంతో ఇక ఏమి చేయలేక ఎంతోమంది షూటింగ్ లు వాయిదా వేసుకుంటున్నారు.అయితే అందరూ కరోనా వైరస్ కు భయపడి షూటింగ్ వాయిదా వేసుకుంటుంటే కొంతమంది మాత్రం తగ్గేదేలే అంటూ శరవేగంగా షూటింగ్ లు చేస్తున్నారు.
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ వరుస షూటింగ్లతో దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
ఇక మిగతా సినిమాలన్నీ కూడా పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు రవితేజ.త్వరలో ధమాకా, టైగర్ నాగేశ్వరరావు సినిమాలో షూటింగులు ప్రారంభించనున్నాడు.
ఆ తర్వాత సుధీర్ వర్మ డైరెక్షన్ లో సినిమాని కూడా లైన్లో పెట్టబోతున్నాడు మాస్ మహారాజ.
ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీలో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న సమంత ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా మారేందుకు సిద్ధమైపోయింది.విడాకుల తర్వాత బాధతో కుంగిపోకుండా వరుస సినిమాలకు కమిట్మెంట్ ఇస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది.కాస్తయినా టైం వేస్ట్ చేయకుండా దూసుకుపోతుంది సామ్.
ప్రస్తుతం యశోద అనే ఒక లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ.ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించుకుంది.
అటు వెంటనే మిగతా సినిమాల షూటింగ్ లను పట్టా లెక్కించేందుకు సిద్ధం అవుతోందట ఈ హీరోయిన్.
ఇటీవలే ప్రారంభమైన కోలీవుడ్ హీరో ధనుష్ ‘సార్’ సినిమా షూటింగ్ కూడా వేగంగా జరుగుతుందట.వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా.కరోనా వైరస్ పెరిగితే ఎప్పుడు ఆంక్షలు వస్తాయో తెలియదు గనుక.
ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారట చిత్రబృందం.దీంతో తగ్గేదేలే అంటూ ధనుష్ కూడా రెడీ అయిపోయాడు.
అయితే అటు టాలీవుడ్లో పెద్ద హీరోల షూటింగ్ లకు మాత్రం కాస్త బ్రేక్ పడినట్లే కనిపిస్తుంది.పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న లైగర్ ఇప్పటికే ఆగిపోయిందని రౌడీ హీరో చెప్పేసాడు.ఇక పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్, మహేష్ హీరోగా తెరకెక్కుతున్న సర్కార్ వారి పాట సినిమాల షూటింగులకు కూడా బ్రేక్ పడింది.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతాయి అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది.