కొడాలి నాని అంటూ సెటైర్లు వేసిన రామ్ గోపాల్ వర్మ..!!

సినిమా టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ ఇండస్ట్రీ అన్నట్టు పరిస్థితి మారిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో గత కొద్ది రోజుల నుండి.

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మంత్రులపై అదే రీతిలో సీఎం పై తీవ్రస్థాయిలో కామెంట్లు చేస్తూ ఉన్నారు.ఎలక్ట్రానిక్ మీడియాలో అదేరీతిలో సోషల్ మీడియాలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.

టికెట్ల రేట్ల విషయంలో ప్రభుత్వన్ని ప్రశ్నిస్తూ.నిన్ననే కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది.

ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ వేసిన ప్రశ్నలకు.కొంతమంది మంత్రులు తమదైన శైలిలో సమాధానాలిచ్చారు.

ఈ తరుణంలో మంత్రి కొడాలి నానినీ టార్గెట్ చేసుకుని రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు.

Telugu Kodali Nani, Ramgopal Varma-Telugu Political News

” ఏపీ టికెట్ల రేట్ల విషయంలో నేను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంబంధించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్ కి సమాధానం చెప్పమని కొందరు నన్ను అడుగుతున్నారు.నాకు తెలిసిన నాని.నేచురల్ స్టార్ నాని ఒక్కడే.

వాళ్ళు చెబుతున్న “కొడాలి నాని” ఎవరో నాకు తెలియదు.అంటూ సోషల్ మీడియాలో ఈ రీతిగా స్పందించారు.

గతంలో నాచురల్ స్టార్ నాని.సినిమా టికెట్ల రేట్లు విషయంలో ఏపీ ప్రభుత్వం పై సెటైర్లు వేయడం తెలిసిందే.

ఆ సమయంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నాకు తెలిసిన నాని…కొడాలి నాని ఒక్కరే తెలుసు…అంటూ మీడియా ముందు కామెంట్లు చేశారు.ఇప్పుడు ఇదే రీతిలో రామ్ గోపాల్ వర్మ నాకు తెలిసిన నాని.“నాచురల్ స్టార్ నాని” అని కామెంట్ చేయటం.ఏపీ రాజకీయాల్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube