నాని ద్వి పాత్రాభినయం చేసిన శ్యామ్ సింగ రాయ్ వసూళ్లు భారీగా ఉన్నాయి.నాని కేరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా ను రూపొందించడం జరిగింది.
దాదాపుగా 60 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కనీసం 50 కోట్ల వసూళ్లు రాబడుతుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.కాని అనూహ్యంగా సినిమా మొదటి వారం రోజుల్లో మంచి వసూళ్లను నమోదు చేసింది.
రెండవ వారంలో ఈ సినిమా కు పోటీ ఏమీ లేదు.రెండు మూడు చిన్నా చితక సినిమా లు విడుదల అయ్యాయి.
అవి కూడా పెద్దగా ప్రభావం చూపించే విధంగా లేవు అంటూ టాక్ వినిపిస్తుంది.మొత్తంగా శ్యామ్ సింగ రాయ్ సినిమా కు రెండవ వారం కలిసి వస్తుంది.
యూఎస్ లో ఈ సినిమా రెండవ వారంలో కూడా ఏకంగా 150 స్క్రీన్ ల్లో స్క్రీనింగ్ అవ్వబోతుంది.
ఈమద్య కాలంలో యూఎస్ లో అన్ని స్క్రీన్స్ లో మీడియం రేంజ్ హీరో సినిమా స్క్రీనింగ్ అవ్వడం చాలా పెద్ద విషయం.
రెండవ వారంలో కూడా శ్యామ్ ఈ స్థాయి లో స్క్రీనింగ్ అవ్వబోతున్న నేపథ్యం లో అక్కడ అరుదైన మైలు రాయిని ఈ సినిమా అందుకోబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.ఈ ఏడాది కరోనా వల్ల వచ్చిన సినిమా లు కొన్నే.

అందుకే యూఎస్ లో మిలియన్ మార్క్ ను దక్కించుకున్నవి మరీ కొన్ని.అందులో శ్యామ్ సింగ రాయ్ సినిమా నిలువబోతున్నట్లుగా తెలుస్తోంది.బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఈ సినిమా అక్కడ నిలువబోతున్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన రన్నింగ్ వసూళ్లు భారీగా ఉన్నాయి.కనుక లాంగ్ రన్ లో ఈ సినిమా వంద కోట్ల మార్క్ ను కూడా క్రాస్ చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు.