ప్రస్తుతం దక్షిణాది సినిమాలు బాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి.వరుసగా తెలుగు సినిమాలు పాన్ ఇండియన్ మూవీస్ గా తెరకెక్కుతున్నాయి.
ఈ సినిమాలు బాలీవుడ్ లోనూ దుమ్మురేపుతున్నాయి.హిందీ సినిమా అభిమానులను సైతం తెలుగు సినిమాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
తెలుగు సినిమాల ధాటికి బాలీవుడ్ దర్శక, నిర్మాతలు సైతం భయపడుతున్నారు.ఇంతకీ బాలీవుడ్ ను షేక్ చేసిన తెలుగుతో పాటు సౌత్ సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా దుమ్మురేపుతుంది.పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్లో సూపర్ సక్సెస్ అయ్యింది.అన్ని భాషల్లో కలిపి మూడు రోజుల్లోనే రూ.180 కోట్లు సాధించింది.తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పుష్పకు జనాలు క్యూ కట్టారు.హిందీలో అల్లు అర్జున్ హీరోగా మరో మెట్టు ఎక్కాడు.సినిమాలే లేక అల్లాడుతున్న హిందీ సినీ ప్రియులకు పుష్ప మంచి ఎంటర్ టైన్మెంట్ ఇచ్చింది.ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలో పుష్ప 6వ స్థానంలో నిలిచింది.
అటు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాయి పలు సౌత్ సినిమాలు.వాటిలో టాప్ 5 సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 2017లో విడుదలైంది.ఇద రూ.1351 కోట్ల వసూళ్లతో ఇండియాలోనే భారీ వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది.రూ.507 కోట్ల వసూళ్లతో రజనీకాంత్ రోబో 2.0 రెండో స్థానాన్ని పొందింది.
బాహుబలి 1 రూ.482 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది.ప్రభాస్ నటించిన సాహో చిత్రం 339 కోట్లతో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురంలో చిత్రం రూ.226.70 కోట్లతో ఐదో స్థానాన్ని అందుకుంది.మొత్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ సినిమాల్లో సౌత్ సినిమాలే ఉండటం విశేషం.ప్రస్తుతం బాలీవుడ్ కు సౌత్ సినిమాలు సవాల్ విసురుతున్నాయని చెప్పుకోవచ్చు.