తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో రిలీజ్ కానన్ని థియేటర్లలో ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కానుంది.అయితే ఏపీలో అమలవుతున్న టికెట్ రేట్లు నిర్మాత దానయ్యను కలవరపెడుతున్నాయి.
ఏపీ ప్రభుత్వం కమిటీ వేసినా ఆ కమిటీ టికెట్ రేట్లను ఎప్పటికి పెంచుతుందో ఎవరికీ తెలీదు. ఏపీలో పాత టికెట్ రేట్లు అమలైతే మాత్రం వచ్చిన కలెక్షన్లు థియేటర్ల రెంట్లకు కూడా గిట్టుబాటు కావనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఏపీలోని కొన్ని థియేటర్లలో 5 రూపాయల టికెట్ రేటు కూడా అమలవుతోంది.500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కినా ఆర్ఆర్ఆర్ సినిమాకు ఈ టికెట్ రేట్లు ఏ మాత్రం వర్కౌట్ కావు.అఖండ, పుష్ప ది రైజ్ సినిమాలకు హిట్ టాక్ వచ్చినా ఆంధ్ర, సీడెడ్ ఏరియాలలో ఈ సినిమాలకు చాలా తక్కువ మొత్తంలో కలెక్షన్లు వచ్చాయి.పలు ఏరియాలలో ఈ రెండు సినిమాలు బ్రేక్ ఈవెన్ కాలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కు ముందే డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు ఆర్ఆర్ఆర్ రైట్స్ ను భారీ మొత్తంలో తగ్గించాలని నిర్మాతతో భేటీ కానున్నారని తెలుస్తోంది.ఆర్ఆర్ఆర్ ఆంధ్ర ఏరియా హక్కులు 100 కోట్ల రూపాయలకు అమ్ముడైతే సీడెడ్ హక్కులు 40 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.ఈ హక్కులను సగానికి తగ్గించాలని డిస్ట్రిబ్యూటర్లు కోరుతున్నారు.ఆర్ఆర్ఆర్ రైట్స్ తగ్గింపు ఏ మేరకు ఉండబోతుందో చూడాల్సి ఉంది.

రేపు జరగబోయే సమావేశంలో ఆర్ఆర్ఆర్ బయ్యర్లు కీలక నిర్ణయం తీసుకోనున్నారని బోగట్టా.కొన్న హక్కులకు సినిమాను రిలీజ్ చేస్తే సగం కూడా రావడం కష్టమని బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు.ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. అఖండ విషయంలో వ్యవహరించినట్టుగా ఆర్ఆర్ఆర్ విషయంలో ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తే మాత్రమే టికెట్ రేట్ల సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.