వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఉప్పెన సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి.తన మొదటి సినీమాతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.ఆ తరువాత వరుసగా ఆఫర్లను అందుకుంది.ఉప్పెన సినిమాలో కృతిశెట్టి యాక్టింగ్ కు యువత ఫిదా అయ్యారు.అలా ఈ సినిమా విడుదలైన తరువాత టాలీవుడ్ ఇండస్ట్రీలో కృతి శెట్టి సంచలనం రేకెత్తించింది.ఉప్పెన సినిమాలో ఈ అమ్మడి అందానికి యువత దాసోహం అయ్యారు.
ఈ సినిమా తరువాత ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.ఈ అమ్మడు ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈమె హీరో నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాలో ఆమె కీర్తి అనే పాత్రలో నటించింది.
ఈ సినిమాలో ఆమె నటనకు గాను మంచి మార్కులే పడ్డాయి.కాకపోతే ఆమె నటించిన మొదటి సినిమాలో పాత్రకు, ఈ సినిమాలోని పాత్రకు చాలా వ్యత్యాసం ఉందని తెలిపింది.
ఈ సినిమా విడుదల అయిన సందర్భంగా ఈ సినిమాలోని పలు విషయాల గురించి ప్రణాళికల గురించి చెప్పుకొచ్చింది కృతి శెట్టి.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.
మొదట ఆమెకు ఏదైనా సినిమాలో అవకాశం వస్తే దాని గురించి రీసెర్చ్ చేస్తానని తెలిపింది.అలాగే ఆమెకు స్మోకింగ్ అంటే నచ్చదన్న విషయాన్ని కూడా తెలిపింది.

అలాంటి సన్నివేశాలు చేసినప్పుడు ఆమెకు చేతులు వణికిపోయాయని తెలిపింది.అలాగే సినిమాలో కూడా బోల్డ్ సీన్ చేస్తే చాలా మంది చెడ్డ అని అనుకుంటారు.సినిమాలలో ఏం చేసినా కూడా అది వృత్తిపరంగానే మేము చేస్తాం.అలాగే పలు సీక్వెన్స్ లకు ఎంత కష్ట పడతారో అన్ని సీన్లకు అలాగే కష్టపడతారు.అన్ని సన్నివేశాల్లోనూ నటించినట్టే ఆ సన్నివేశాల్లో కూడా నటిస్తాము.ఒకవేళ కథలో ఆ సీన్స్ అవసరం అనిపించి నచ్చితేనే చేస్తాను, లేదంటే చేయనని చెప్పుకొచ్చింది కృతి శెట్టి.