క్రిస్టియన్స్ జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో క్రిస్మస్ పండుగ కూడా ఒకటి.క్రిస్మస్ పండుగ రోజున క్రిస్టియన్స్ ఆ పండుగను ఎంతో ఘనంగా వైభవంగా జరుపుకుంటారు.
ఈ క్రమంలోనే పలువురు పేదవారికి దానధర్మాలు సైతం చేస్తూ ఉంటారు.అలా హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ స్క్వాజ్ నెగ్గర్ మరొకసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు.
ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానులను కలిగిన హాలీవుడ్ కండలవీరుడు ఆర్నాల్డ్ స్క్వాజ్‌నెగ్గర్.ఇతను ఎన్నో సందర్భాలలో ఎంతోమందికి దానధర్మాలు చేసి ఎంతోమంది మనసులలో స్థానం సంపాదించుకున్నాడు.
ఆర్నాల్డ్ స్క్వాజ్‌నెగ్గర్ తాజాగా క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్మస్ పండుగను అతడు బతికినంతకాలం గుర్తుండిపోయే విధంగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నాడు.ఇందుకోసం అతను క్రిస్మస్ పండుగ సందర్భంగా నిలువ నీడలేని నిరుపేదల కోసం ఇల్లు సిద్ధం చేయించాడు.
అలా క్రిస్మస్ పండుగ రోజు ఏకంగా 25 ఇళ్లను దానం చేసి మరొకసారి రియల్ హీరో అనిపించుకున్నారు.ఇదే విషయాన్ని అతను సోషల్ మీడియాలో పంచుకుంటూ క్రిస్మస్ పండుగను నేను ముందుగానే జరుపుకుంటున్నా.
తలదాచుకోడానికి ఇల్లు లేని వారి కోసం 25 ఇల్లు రెడీ చేయించాను.వీటిలోకి రాబోతున్న హీరోలకు ఇదే నా స్వాగతం.
వారితో కొంత సమయాన్ని గడిపినందుకు చాలా సంతోషంగా ఉంది అని ట్వీట్ చేశారు.
చాలామంది ఆర్నాల్డ్ స్క్వాజ్‌నెగ్గర్ సేవా కార్యక్రమాలకు పెద్దపీటగా పిలుస్తూ ఉంటారు.అందుకు సంబంధించిన ఫోటోలను కూడా అతను షేర్ చేయగా ఆ ఫోటోలను చూసిన కొందరు నెటిజన్స్ స్పందిస్తూ వాటిని ఎవరు ఇల్లు గా పరిగణించవద్దు.ఎందుకంటే అవి కేవలం తాత్కాలిక షెల్టర్స్ లాగానే కనిపిస్తున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇంకొందరు నెటిజన్లు అతడు చేసిన పనికి అతడి పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.ఈ విషయంపై ఒక్కొక్కరు ఒక విధంగా స్పందిస్తున్నారు.ఇక ఆర్నాల్డ్ స్క్వాజ్‌నెగ్గర్ హాలీవుడ్ లో యాక్షన్ చిత్రాలలో నటించి ఎంతోమంది ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నారు.అలాగే 2003 నుంచి 2011 వరకు కాలిఫోర్నియా లో గవర్నర్ గా కూడా పని చేశారు.