జనవరి 6 నాటి క్యాపిటల్ బిల్డింగ్‌పై దాడి ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న హౌస్ సెలక్ట్ కమిటీ… జేపీ మోర్గాన్ నుంచి తన ఆర్ధిక పత్రాలను పొందకుండా నిరోధించాలంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార ప్రతినిధి టేలర్ బుడోవిచ్ శుక్రవారం కోర్టులో దావా వేశారు.జనవరి 6 నాటి ఘటనకు సంబంధించి 9 మంది సభ్యులున్న ప్రతినిధుల సభ కమిటీ చేపట్టిన విచారణకు వ్యతిరేకంగా ట్రంప్ పోరాడుతున్న సంగతి తెలిసిందే.
దీనిలో ఆయన వ్యక్తిగత చర్యలు, ట్రంప్ సహాయకులు, రాజకీయ సలహాదారుల పాత్ర వుందని అమెరికా వ్యాప్తంగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.
యూఎస్ క్యాపిటల్ దాడికి ముందుకు వాషింగ్టన్ డీసీలోని ఎలిప్స్‌తో సహా ‘‘స్టాప్ ది స్టీల్’’ ర్యాలీలను ప్లాన్ చేయడంలో బుడోవిచ్ పాల్గొన్నట్లు కమిటీ ఆరోపిస్తోంది.
ఈ వ్యవహారంలో ఇతర ట్రంప్ మిత్రులకు… కమిటీ గత నెల సబ్ పోనెడ్ దాఖలు చేయడంతో బుడో విచ్ కోర్టును ఆశ్రయించారు.అయితే సబ్‌పోనాకు కట్టుబడి.1700 పేజీలకు పైగా పత్రాలను అందించారు.‘‘ఎలిప్స్ ర్యాలీకి సంబంధించి డిసెంబర్ 19,2020 నుంచి జనవరి 31, 2021 వరకు అన్ని లావాదేవీలకు సంబంధించి ఈ పత్రాలు సరిపోతాయని దావాలో పేర్కొన్నారు.
అయినప్పటికీ సెలెక్ట్ కమిటీ తప్పుగా బుడోవిచ్ ఆర్ధిక సంస్థను ప్రైవేట్ బ్యాంకింగ్ సమాచారాన్ని అందించమని బలవంతం చేస్తోందని, ఇందుకు చట్టబద్ధమైన అధికారం లేదని దావాలో తెలిపారు.
సబ్‌పోనా లేఖలో బుడోవిచ్ జనవరి 6వ తేదీ ఎలిప్స్ ర్యాలీని ప్రోత్సహించడం, ఎన్నికల ఫలితం గురించి నిరాధారమైన వాదనలను ముందుకు తీసుకురావడం కోసం సోషల్ మీడియా, రేడియో ప్రకటనల ప్రచారాన్ని నిర్వహించేందుకు 501 సీ (4) సంస్థను అభ్యర్ధించినట్లు పేర్కొంది.
ఈ క్రమంలోనే దాదాపు 2,00,000 డాలర్ల చెల్లింపుపై తమకు అనుమానాలు వున్నట్లు సెలక్ట్ కమిటీ పేర్కొంది.

కాగా, అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాట్ నేత జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించడం కోసం జనవరి 6 న యూఎస్ కాంగ్రెస్.క్యాపిటల్ భవనంలో సమావేశమైంది.ఈ సందర్భంగా ట్రంప్ ఇచ్చిన పిలుపుతో అప్పటికే వాషింగ్టన్ చేరుకున్న ఆయన మద్దతుదారులు.
భవనంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసి, అలజడి సృష్టించారు.బారికేడ్లను దాటుకుని వచ్చి కిటికీలు, ఫర్నిచర్, అద్దాలు పగులగొట్టారు.
వారిని శాంతింపజేసేందుకు తొలుత టియర్ గ్యాస్ ప్రదర్శించినప్పటికీ లాభం లేకపోయింది.దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో పోలీసులు తూటాలకు పనిచెప్పడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
అమెరికా చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయిన ఈ ఘటనకు సంబంధించి ఎన్నో విచారణ కమీటీలు దర్యాప్తు చేస్తున్నాయి.