టీమ్ ఇండియా మాజీ సారథి కపిల్ దేవ్ బయోపిక్ 83 గురించి మనందరికీ తెలిసిందే.ఈ సినిమాలో బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు.
ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల కానుంది.ఈ సినిమాకు ఖబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.1983లో కపిల్ దేవ్ సారథ్యంలో భారత్ క్రికెట్ వరల్డ్ కప్ ను గెలుచుకున్న విషయం తెలిసిందే.వరల్డ్ కప్ నేపథ్యం ఆధారంగా 83 సినిమా తెరకెక్కబోతోంది.
ఇక సినిమాలో కపిల్ దేవ్ పాత్రలో రణ్ వీర్ సింగ్ నటించాడు.
ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్ ఆ పాత్రలో నటించినందుకు గాను భారీగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ లో రణ్ వీర్ వివిధ రకాల పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్లు అందుకుంటున్నారు.ఇతనికి బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.83 సినిమాకు గాను రణ్ వీర్ సింగ్ 20 కోట్లు వసూలు చేశాడట.అంతేకాకుండా ఈ సినిమాకు వచ్చే లాభాల్లో కూడా షేర్ ఇవ్వాలని నిర్మాతలను కోరాడట.
అయితే ఎంత మొత్తంలో డబ్బులు షేర్ చేసుకుంటాడు అన్న విషయం తెలియడం లేదు.ఈ సినిమా విడుదల తరువాత ఆ మొత్తం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

ఇకపోతే ఈ సినిమా కోసం క్రికెట్ ప్రియులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఈ సినిమాపై మరింత అంచనాలు క్రియేట్ చేశాయి.83 రిలయన్స్ ప్రొడక్షన్ నిర్మించింది.ఈ సినిమాలు రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొనే, పంకజ్ త్రిపాఠి, తాహిర్ రాజ్ భాసిన్, సాకిబ్ సలీం, జతిన్ సర్నా, చిరాగ్ పాటిల్, డింకర్ శర్మ, నిశాంత్ దహియా, హార్డి సందు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
మొత్తానికి క్రికెట్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న 83 సినిమా క్రిస్మస్ పండుగకు గ్రాండ్ గా రిలీజ్ కానుంది.