టాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ రష్మిక మందన్న మరొకసారి వార్తల్లో నిలిచింది.ఇప్పటికే ఈ బ్యూటీ పలు సార్లు వార్తల్లో నిలిచి ట్రోల్ అయినా విషయం తెలిసిందే.
తాజాగా మరొకసారి ఈ అమ్మడి టాపిక్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.ఇంతకీ రష్మిక టాపిక్ హాట్ టాపిక్ గా ఎందుకు అయ్యిందో తెలుసా.
రష్మిక ప్రసెంట్ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకు పోతుంది.
నేషనల్ క్రష్ గా అందరి గుండెల్లో నిలిచి పోయిన ఈ అమ్మడి అందాలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే బేధం లేకుండా ఎక్కడ అవకాశం పలకరిస్తే అక్కడికి వెళ్తుంది.ఇటీవలే అల్లు అర్జున్ తో కలిసి చేసిన పుష్ప సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాలో రష్మిక డీ గ్లామర్ పాత్రలో కనిపించి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ను తెచ్చుకుంది.
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 17న విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.

ఈ సినిమాలోని సామీ సామీ సాంగ్ కూడా అందరి హృదయాలకు కనెక్ట్ అయ్యిందనే చెప్పాలి.ఈ పాట వచ్చినప్పటి నుండి అందరి నోళ్ళలో ఇదే పాట వినిపిస్తుంది.ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు అందుకుంటున్న రష్మిక మరొకసారి వార్తల్లో నిలిచింది.

ఇటీవలే ఇంట్లో పూజలు చేయించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.అయితే ఈ పూజలు చేయడానికి గల కారణాలు అయితే బయటకు రాలేదు.సినీ పరిశ్రమలో వివాదాల స్వామిగా పేరు తెచ్చుకున్న వేణు స్వామి తో రష్మిక ఇంట్లో పూజలు చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
అయితే ఈ పూజలు ఎందుకో తెలియదు కానీ రష్మిపై మరొకసారి ట్రోల్స్ మొదలయ్యాయి.ఈ పూజల విషయం తెలుసుకున్న తర్వాత నెటిజెన్స్ వారికీ తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు.
హిట్ కావాలని పూజలు చేసావా.లేదంటే అవార్డ్స్ రావాలని చేసావా అని కామెంట్స్ చేస్తూ ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.