మన దేశంలో నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక కరోనా తర్వాత మరింత దారుణంగా పరిస్థితులు తయారయ్యాయి.
ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోయాయి.దీంతో చాలామంది నానా అవస్థలు పడుతున్నారు.
ఇక అప్పుడు ఎడ్యుకేషన్ అయిపోయిన వారు అయితే ఆన్ లైన్ లో ఉద్యోగాల కోసం నిత్యం వేట సాగిస్తున్నారు.కానీ వారికి మాత్రం అనుకున్న స్థాయిలో అవకాశాలు రావట్లేదు.
అయితే ఇప్పుడు ఓ వార్త మనందరినీ గర్వ పడేలా చేస్తోంది.అదేంటంటే మన హైదరాబాద్ ఉద్యోగాల్లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉందంట.
దేశ నలుమూలల నుంచి చాలామంది ఉద్యోగాల కోసం హైదరాబాద్‌ను ఎంపిక చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.ఈ విషయాన్ని ఇండీడ్ అనే జాబ్ సైట్ వెల్లడించింది.
ఎక్కువగా హైదరాబాద్, బెంగళూరు, ముంబయి సిటీలకే ఉద్యోగం లో ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నట్టు వెల్లడించిది.ఇక వీటి తర్వాత పూణె, చెన్నై సిటీలు ఉన్నాయి.
లోన్ ఆఫీసర్ తో పాటుగా రిక్రూట్‌మెంట్ మేనేజర్ అలాగే ప్యాకేజర్ లాంటి జాబ్స్ కోసం ఎక్కువ మంది అప్లై చేసుకుంటున్నారు.ఇక కంపెనీలు కూడా ఈ జాబులను అధికంగా ప్రకటిస్తున్నాయంట.

గత ఏడాది 2020 డిసెంబరు నెల నుండి మొదలు పెడితే ఈ ఏడాది డిసెంబర్ దాకా 2,448 శాతం మంది ఈ జాబుల కోసం హైదరాబాద్‌ను సెలక్ట్ చేసుకుంటున్నట్టు వెల్లడించింది ఆ జాబ్ సైట్.ఎక్కువగా ఈ ఏడాది జాబ్ పోస్టింగ్స్ రావడం మంచి పరిణామంగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు.క్రెడిట్ మేనేజర్ అలాగే లోన్ ఆఫీసర్ లాంటి జాబుల కోసం కూడా ఎక్కువ మంది అప్లికేషన్ చేసుకుంటున్నట్టు తెలిపింది ఈ జాబ్ సైట్.ఈ తరహా జాబులు ఎక్కువగా హైదరాబాద్‌లోనే కనిపిస్తుండటంతో ఎక్కువ ప్రాముఖ్యతను వాటికే ఇస్తున్నట్టు వివరించింది ఈ జాబ్ సైట్.