తీసిన ప్రతి సినిమా హిట్ కావాలి అనే రూల్ ఏమీ లేదు.ఏడాదికి వందల సినిమాలు వస్తుంటాయి.
అందులో కొన్ని మాత్రమే సక్సెస్ అవుతాయి.మరికొన్ని బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడతాయి.
అయినా కొన్ని సినిమాలు జయాపజయాలతో సంబంధం లేకుండా జనాల మనసులను దోచుకుంటాయి.అలాగే ఈ ఏడాది భారీ అంచనాలతో వచ్చి పరాజయం పాలైన సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
*రాధే : మోస్ట్ వాంటెడ్ భాయ్
బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ హీరోగా చేసిన సినిమా ఇది.ఇందులో తనకు జోడీగా దిశా పటానీ యాక్ట్ చేసింది.ప్రభుదేవా ఈ సినిమాను రూపొందించాడు.అయితే గతంలో వీరి కాంబోలో వచ్చిన వాంటెడ్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.ఈ నేపథ్యంలో రాధే సినిమా కూడా మంచి హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు.కానీ ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో కాదు కదా.అసలు మామూలు స్థాయిలో కూడా విజయాన్ని అందుకోలేదు.కేవలం ఈ సినిమా 1.8 రేటింగ్ మాత్రమే సాధించింది.
*హంగామా 2

2003లో వచ్చిన హంగామా సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రిలీజ్ అయ్యింది.రొమాంటిక్ కామెడీ సినిమాగా విడుదల అయిన ఈ సినిమాపై జనాలు బాగా అంచనాలు పెట్టుకున్నారు.కానీ ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు.2.1 రేటింగ్ తో ఫ్లాప్ అయ్యింది.
*లాహోర్ కాన్ఫిడెన్షియల్

ఈ సినిమా రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కింది.పలు రహస్య అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు.రిచా చద్దా, అరుణోదయ సింగ్, కరిష్మా తన్నా లాంటి పలువురు నటీనటులు యాక్ట్ చేసినా.ఈ సినిమా జనాలను అలరించలేదు.కేవలం 2.8 రేటింగ్ తో ఈ సినిమా కూడా పరాజయాన్ని మూటగట్టుకుంది.
*రూహీ

కామెడీ, హార్రర్ సినిమాగా రూహీ తెరకెక్కింది. రాజ్ కుమార్ రావ్, జాన్వీ కపూర్, వరుణ్ శర్మ కీలక పాత్రలు చేశారు.అయినా జనాలు ఈ సినిమాను ఆదరించలేదు.ఈ సినిమా 4.3 రేటింగ్ సాధించింది.
*ది గర్ల్ ఆన్ ది ట్రైన్

నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమాలో పరిణీతి చోప్రా కీలకపాత్ర పోషించింది.టీజర్లు, ప్రోమోలు జనాలను ఆకట్టుకున్నా సినిమా మాత్రం ఆకట్టుకోలేదు.ఈ సినిమాకు 4.4 రేటింగ్ వచ్చింది.