సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడు ఎస్.ఎస్ తమన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈయన ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలను చేతిలో పెట్టుకొని ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న ఎస్.
ఎస్.తమన్ తాజాగా బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమాకు అందించిన బ్యాక్‌గ్రౌండ్ మాస్ బీజీయంకు ఆమెరికా బాక్సాఫీసు సైతం దద్దరిల్లింది పోయిందని చెప్పాలి.ఇక ఈ సినిమా థియేటర్లో చూసిన బాలకృష్ణ ఈ సినిమా విజయవంతం అవడానికి తమన్ పాత్ర కూడా ఎంతో ఉందని ఆయన కూడా ఒక హీరో అంటూ అతని పై ప్రశంసల వర్షం కురిపించారు.
ఇలా తమన్ సంగీతం అందించిన ఈ సినిమా విజయవంతం కావడంతో ఒక బుల్లితెర కార్యక్రమంలో పాల్గొని తన గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా ప్రస్తుతం ఇండస్ట్రీలో తనకు ఉన్న ఈ స్టార్ డమ్ వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయని, ఈ హోదా తనకు చాలా సులభంగా వచ్చింది కాదని తెలిపారు.ఈ క్రమంలోనే కన్నీటి కష్టాలను కూడా ఈ సందర్భంగా తమన్ బయటపెట్టారు.
ఎస్.ఎస్.తమన్ కేవలం ఆరో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారని అదేసమయంలో తన తండ్రి చనిపోవడంతో తనకు చదువు మీద ఏమాత్రం ఆసక్తి లేకపోవడం వల్ల చదువు మానేసాను అని తెలిపారు.
ఇక ఢిల్లీలో మా అత్తయ్య వాళ్ళు ఇంటి నుంచి తిరుగు ప్రయాణం అయినప్పుడు నాన్నకు సడన్ గా హార్ట్ ఎటాక్ వచ్చి ట్రీట్మెంట్ ఆలస్యం కావడంతో చనిపోయారని, నాన్న చనిపోయినప్పుడు ఎల్ఐసి పాలసీ ద్వారా 60 వేల రూపాయలు డబ్బులు వచ్చాయి.
నాన్న చనిపోయినప్పుడు నాకు కంటి నుంచి ఒక చుక్క నీరు కూడా రాలేదని తన తల్లిని, అక్కను చూస్తూ అలా ఉండిపోయానని తమన్ ఈ సందర్భంగా వెల్లడించారు.ఇక నాన్న చనిపోయిన తర్వాత వచ్చిన 60 వేలతో అమ్మ నాకు డ్రమ్స్ కొనిచ్చి నేర్చుకోవడానికి పంపించారు.

ఇలా సంగీతంలో సాధన చేసిన అనంతరం మొట్టమొదటిసారిగా బాలకృష్ణ నటించిన భైరవ ద్వీపం సినిమాకు పని చేశానని, ఈ సినిమాకు చేసినందుకుగాను 30 రూపాయలు పారితోషికం ఇచ్చారని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు.ఇక తన మొదటి సినిమా 30 రూపాయల పారితోషికం అందుకున్న తమన్ క్రమ క్రమంగా తన క్రేజ్ పెంచుకుంటూ వచ్చారు.ప్రస్తుతం తమన్ స్టార్ హీరోలందరి సినిమాలకు సంగీతం అందిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇక ఈయన ప్రస్తుతం ఒక సినిమాకు దర్శకత్వం వహిస్తే సుమారు రెండు నుంచి 2.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.